పహల్గాం టెర్రర్ ఎటాక్.. మళ్లీ బుక్కైన సాయి పల్లవి.. చెప్పండి వాళ్లు మనం ఒక్కటేనా..?

పహల్గాం టెర్రర్ ఎటాక్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ప్రధానమంత్రి మోడీ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 02:00 PMLast Updated on: Apr 24, 2025 | 2:00 PM

Pahalgam Terror Attack Sai Pallavi Is Booked Again

పహల్గాం టెర్రర్ ఎటాక్ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ప్రధానమంత్రి మోడీ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నాడు. ఎలాగైనా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన అన్ని విధాలుగా కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే పహల్గాం టెర్రర్ ఎటాక్ పై సినిమా వాళ్ళు కూడా తమ తమ అభిప్రాయాలు తెలిపారు. ప్రతి ఒక్కరు దీని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఈ అటాక్ నేపథ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మరొకసారి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. టెర్రరిస్ట్ అటాక్స్ కు సాయి పల్లవికి ఏంటి సంబంధం అనుకోవచ్చు..! ఒకసారి మనం మాట్లాడిన మాట జీవితాంతం అలాగే గుర్తుండిపోతుంది అనడానికి ఇప్పుడు సాయి పల్లవిని ఎగ్జాంపుల్ గా చూపిస్తే సరిపోతుంది. మూడేళ్ల కింద విరాటపర్వం సినిమా సమయంలో ఆమె చేసిన కామెంట్స్ మరోసారి గుర్తు చేసి మరీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా జరిగిన ఉగ్ర దాడుల్లో 27 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మరింత దారుణమైన విషయం ఏంటంటే.. ఐడీ కార్డులు చెక్ చేసి మరీ హిందువులను మాత్రమే పాయింట్ బ్లాంక్ లో కాల్చేశారు. ఈ ఘటనపై కేవలం భారతదేశం మాత్రమే కాదు మిగిలిన దేశాలు కూడా పాకిస్తాన్ మీద ఓ రేంజ్ లో కోపంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రదాడిపై గతంలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ , పాక్ ఆర్మీ ఒకటే అంటూ చేసిన కామెంట్స్ ను మళ్లీ తెరమీదకి తీసుకొస్తున్నారు. పాక్ సైనికులు మన వాళ్ళని ఎలాగైతే టెర్రరిస్టులుగా చూస్తారో.. మన వాళ్ళు కూడా వాళ్ళను అలాగే టెర్రరిస్టులుగా చూస్తారు అంటూ విరాట పర్వం సినిమా ప్రమోషన్ టైంలో చెప్పింది సాయి పల్లవి. తాజాగా జరిగిన దాడిని చూపిస్తూ.. ఇప్పుడు చెప్పండి సాయి పల్లవి గారు మనవాళ్లు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒకటేనా అని అడుగుతున్నారు. అమాయకులు ఏం చేశారు.. హిందువులు అని కనుక్కొని మరి చంపాల్సిన అవసరం ఏంటి అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. వాళ్లు, మనం వేరువేరు అని.. ఆదేశ టెర్రరిస్టులకు మన సైనికులకు చాలా తేడా ఉందనే విషయం ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి అంటూ సాయి పల్లవికి హితవు పలుకుతున్నారు నెటిజన్లు.

ఈ నేపథ్యంలోనే పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఇటీవల కాలంలో చేసిన కామెంట్స్ కూడా ఆమెకు గుర్తు చేస్తున్నారు. జమ్ము కాశ్మీర్ లో హిందువులు ముస్లింలను వేరువేరుగా చూస్తారు అంటూ మత విదేశాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడాడు. పోయి పోయి ఇలాంటి వాళ్లను మన వాళ్ళతో పోలుస్తారా అంటూ సాయి పల్లవిని ఇప్పుడు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. అందుకే దేశం గురించి గానీ, ఆర్మీ గురించి గానీ మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి అని చెప్పేది. ఇప్పుడు చూడండి ఎప్పుడో మూడేళ్ల కింద చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు మళ్లీ తెరమీదకు తీసుకొచ్చి ఈ హీరోయిన్ ను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.