Shaheen Afridi: భార్యతో రెండో పెళ్లి
రెండో పెళ్లికి సిద్దమైన పాకిస్తాన్ బౌలర్.

Pakistan bowler Shaheen Afridi's wife Ansha is going to get married for the second time
పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. తన భార్య అన్షాను రెండోసారి వైభవంగా నిఖా చేసుకోనున్నాడు. ఆసియా కప్-2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఈ వేడుక జరుగనుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తమ కుమార్తె అన్షా వివాహాన్ని షాహిన్‌తో జరిపించాడు. అయితే, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సహా ఇరు కుటుంబాలకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కొత్త జంట భావించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19న షాహిన్- అన్షా నిఖా చేసుకోనున్నట్లు పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే, ఆసియా కప్ తర్వాత రోజుల వ్యవధిలోనే భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో కొత్త జంట హనీమూన్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న ఆసియా కప్ ఫైనల్ ముగియనుండగా.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.