Pakistan: విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90శాతం మంది పాకిస్థానీలే.. దీనికి కారణాలేంటి..?

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీని ప్రభావం విదేశీ జైళ్లపై పడుతోంది. పాక్ ఆర్థిక సంక్షోభానికి.. విదేశాల్లోని జైళ్లలో ప్రభావం చూపడానికి సంబంధమేంటి అని అనుకుంటున్నారా..? అయితే పూర్తి వివరాలు చదవాల్సిందే. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2023 | 08:57 AMLast Updated on: Oct 03, 2023 | 8:57 AM

Pakistan Is Sending Visas To 90 Percent Of Beggars Abroad

ఒకప్పుడు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది. చాలా గ్లోబల్ దేశాలతో పోటీ పడేంత గొప్ప స్థితిలో లేనప్పటికీ, ఒక గొప్ప స్థానంలో కొనసాగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. తినేందుకు తిండిలేక, తాగేందుకు గుక్కెడు మంచి నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతోంది. దీనికి కారణం అతిక్రమించిన అవినీతి రాజ్యమేలడంతో పాకిస్థాన్ కి ఈ గతిపట్టినట్లు చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ప్రజల ఆకలికేకలు ఎక్కువైపోయాయి. ఏం కోనాలన్నా డబ్బులు లేవు. ఒక వేళ ఉన్నా కొనేంత స్థాయిలో వస్తువులు లేవు. ధరలు ఆకాశాన్నంటాయి. పైగా యువతకు ఉపాధిలేదు. చదువుకు తగ్గ ఉద్యోగావకాశాలు అస్సలే లేవు. దీంతో ఆ దేశ పరిస్థితి పూర్తిగా నీరుగారిపోయింది. తిండి దొరక్క ప్రజలు చనిపోతున్నారు.

షార్ట్ షిష్ట్ అంటే..

ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి బయట పడేందుకు పాకిస్థాన్ కొత్త అవకాశాలను ఎంచుకుంది. అదే షార్ట్ షిఫ్ట్. అంటే సొంత దేశంలో చేసేదేమీ లేక విదేశాలకు పయనమవడం. దీనికి ప్రభుత్వం కూడా ఎంతో బాగా సహకరిస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ వారికి బ్రతికే మార్గం చూసుకోమని సాగనంపుతోంది. ఇలా బయట దేశాలకు వెళ్లినప్పటికీ సరైన నైపు‎ణ్యాలు లేని కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. గద్యంతరంలేక బిక్షాటనే లక్ష్యంగా జీవనాన్ని సాగిస్తున్నారని కొన్ని తాజా నివేదికలు తెలిపాయి. దీనికి సరైన ఆధారాలను కూడా వెలువరించాయి. విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థానీలే కావడం గమనార్హం. ఇందులో కొందరు అడుక్కొని జీవనం సాగిస్తుంటే మరి కొందరు పిక్ పాకెటింగ్, చిల్లర దొంగతనాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్లతో ఇక్కడి జైళ్లు నిండిపోతున్నాయని మండిపడుతున్నారు విదేశాంగశాఖ అధికారులు. దీనిపై సెనేట్ లో తీవ్రమైన చర్చ జరిగింది. ఈ చర్చలో పాక్ నుండి పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు వెళ్తున్నారని పాకిస్థాన్ ప్రభుత్వమే వెల్లడించింది. ఈ రకమైన విధానం ద్వారా మానవ అక్రమ రవాణాకు ఆజ్యం పోసినట్లవుతుందని విదేశాంగ కార్యదర్శి జుల్పికర్ హైదర్ సెనేట్ స్టాండింగ్ కమిటీకి తెలిపారు.

ఈ దేశాల్లోనే అధికం..

పాకిస్థాన్‌లోని యాచకులు ఉమ్రా వీసా అంటే టూరిస్ట్ వీసా తీసుకుని విదేశాలకు తరలిపోతున్నారని సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వింగ్ సభ్యులు వివరించారు. హరామ్ వంటి పవిత్ర ప్రదేశాలలో పట్టుబడిన పిక్‌పాకెట్లలో ఎక్కువ మంది పాకిస్థానీలు అని చెబుతూ.. వీరు ఒకప్పుడు పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవారని తెలిపారు. ఇప్పుడు జపాన్ తమ కొత్త గమ్యస్థానంగా మారుతోందని, పాకిస్థాన్ తన విదేశీ మారకద్రవ్యాన్ని పెంచుకోవాలనుకుంటే, నైపుణ్యం కలిగిన కార్మికులను విదేశాలకు పంపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులకు సౌదీ అరేబియా ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అదే సమయంలో జపాన్ వంటి దేశాలు కూడా నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలని భారత్, నేపాల్, పాకిస్థాన్ దేశాల నుంచి వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారు అక్కడికి వెళ్తున్నారని సెనేటర్ రాణా మెహమూదుల్ హసన్ వెల్లడించారు.

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు..

పాకిస్థాన్‌లో ప్రస్తుతం 50 వేల మంది ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారు. సౌదీ అరేబియాలో మూడు మిలియన్ల మంది పాకిస్థానీయులు, UAEలో 1.5 మిలియన్లు, ఖతార్‌లో దాదాపు 2,00,000 మంది పాకిస్థానీయులు ఉన్నారు. పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నందున, పాక్ ఇంజనీర్లకు సహాయం చేసేందుకు జపాన్, చైనా వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సంబంధిత సంస్థలతో చర్చలు జరిపితే బాగుంటుందని జుల్ఫికర్ హైదర్ కోరారు. పాకిస్థాన్‌లో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు కేవలం 15 నుంచి 20 వేల వేతనాలు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, యాత్రికుల వీసాలతో పాకిస్థాన్‌ నుంచి వచ్చే యాచకులను ఆపాలని సౌదీ అరేబియా, ఇరాక్‌ వంటి దేశాలు పాక్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

T.V.SRIKAR