Bigg boss : చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్.. రైతు బిడ్డదే టైటిల్
బిగ్ బాస్ హౌస్‌లో హిస్టరీ క్రియేట్ అయ్యింది.. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ కొట్టాడు. కామన్ మెన్ గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విజేతగా అవతరించాడు. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ గా రికార్డుల కెక్కాడు.. వెక్కిరింతలను, చిన్నచూపులను తట్టుకొని నిలబడి.. అందరి అంచనాలు, అభిప్రాయాలను తారుమారు చేస్తూ.. హౌజ్‌లో తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు పల్లవి ప్రశాంత్..

టైటిల్ కోసం ఫైనల్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ పోటీపడ్డారు. శివాజీ ఎలిమినేట్ కావడంతో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ టైటిల్ పోరులో నిలిచారు. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ప్రశాంత్ గెలిచి సంచలనం సృష్టించాడు. ఒక సాధారణ రైతుబిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. తన అద్భుతమైన ఆట తీరుతో విన్నర్‌గా నిలవడంతో అతడి ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక సాధారణ యూట్యూబ్, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ కావడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ ఏడో సీజన్ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా హౌజ్‌లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం అని కామెంట్లు చేసే వాళ్లే ఎక్కువ.. అయితే.. అతికొద్ది కాలంలోనే తానేంటో నిరూపించాడు ప్రశాంత్.. ‘రైతు బిడ్డ అనే ట్యాగ్ కొంచెం అతనిపై సెంటిమెంట్ ను క్రియేట్ చేసినప్పటికీ హౌజ్‌లో తన ఆటతీరుతోనే ఆకట్టుకున్నాడు. ప్రేమ పేరుతో కొన్ని రోజులు కాస్త పక్కదారి పట్టినప్పటికీ.. మళ్లీ తన లక్ష్యాన్ని గుర్తించి.. టైటిల్‌పైనే గురిపెట్టాడు. బిగ్ బాస్ చరిత్రలోనే వేగంగా టాస్క్‌లు ఆడి అత్యంత ఫాస్టెట్ గేమర్‌గా రికార్డుకెక్కాడు.
కేవలం హౌజ్‌లోనే కాదు బయట కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్.. ప్రశాంత్‌పై వచ్చిన నెగిటివ్ ప్రచారాలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ముఖ్యంగా ఓటింగ్‌లో రైతు బిడ్డకు తిరుగులేని మద్దతు లభించింది. అదే తనను విజేతగా నిలిపింది. ఇక.. బిగ్ బాస్-7 ఫైనల్ రేసులో రెండో స్థానంలో సీరియల్ నటుడు అమర్ దీప్ నిలవగా, మూడో స్థానంలో శివాజీ నిలిచాడు. నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో ప్లేస్‌లో అర్జున్ అంబటి నిలిచారు.