Palvai Sravanti : బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి.. పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.
పాల్వాయి స్రవంతి పార్టీలో చేరిన సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) లో పదవులు ముందంజలో ఉన్న నాయకులకు కాకుండా కొత్త వారికి ఇస్తున్నారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతి చేరికను స్వాగతిస్తున్నామన్నారు.

Palvai Sravanti who joined BRS KTR invited to the party
దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి (Govardhan Reddy) కుమార్తె పాల్వాయి స్రవంతి ( Palwai Sravanti) భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి రాజీనామా చేసి.. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మంత్రి కేటీఆర్ ( KTR ) ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిక తర్వాత స్రవంతి మాట్లాడుతు.. బాగా ఆలోచించే బీఆర్ఎస్ లో చేరాను.. పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. గౌరవం లేని చోట నేను ఉండాల్సిన పని లేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి పార్టీకి పని చేసిన వారిని గుర్తించడకుండా.. పార్టీలు మారి వచ్చిన వారికి అవకాశం కల్పిస్తున్నారు.
పాల్వాయి స్రవంతి పార్టీలో చేరిన సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) లో పదవులు ముందంజలో ఉన్న నాయకులకు కాకుండా కొత్త వారికి ఇస్తున్నారని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతి చేరికను స్వాగతిస్తున్నామన్నారు. స్రవంతి పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదన్నారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోని.. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. ఇక మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఎందుకు పార్టీలు మారుతున్నారో తెలియడం లేదని.. ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి సేవలను కొనియాడారు మంత్రి కేటీఆర్. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.