ఫౌజీలో పాన్ ఇండియా యాక్టర్.. తప్పక ఓకే చేసిన రెబల్ స్టార్

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ రావడానికి ఇప్పుడైతే కచ్చితంగా లక్ ఉండాల్సిందే. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ పై వార్ డిక్లేర్ చేసిన ప్రభాస్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 01:15 PMLast Updated on: Feb 15, 2025 | 1:15 PM

Pan India Actor In Fauji Movie

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ రావడానికి ఇప్పుడైతే కచ్చితంగా లక్ ఉండాల్సిందే. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ పై వార్ డిక్లేర్ చేసిన ప్రభాస్… ఇప్పుడు చేతిలో ఏకంగా ఏడు సినిమాలు పెట్టుకుని రెడీ అవుతున్నాడు. వీటిలో ఒక సినిమా సమ్మర్లో రిలీజ్ అవుతుంటే.. మరో సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ అవుతుంది. వచ్చేయడాది సంక్రాంతికి కచ్చితంగా ప్రభాస్ నుంచి ఓ మూవీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు ప్రభాస్ పెద్దగా సంక్రాంతి పై ఫోకస్ చేయలేదు.

కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కచ్చితంగా సంక్రాంతి పై ఫోకస్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ మరో రెండు రోజులు చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తాడు. ఆ సినిమా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పిరిట్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఆ సినిమా మధ్యలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనే ఛాన్స్ కూడా కనబడుతోంది.

ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశాడు. ఇక ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ నడుస్తోంది. ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి డైరెక్షన్ లో చేయబోయే సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ కేర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేశారు. తన 544వ సినిమాలో ప్రభాస్ తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నాడు అనుపమ కేర్. ఈ మధ్య తెలుగు సినిమాల విషయంలో బాలీవుడ్ యాక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కార్తికేయ 2 లో కూడా అనుపమ్ కేర్ కేర్ మంచి రోల్ ప్లే చేశారు. ఆ సినిమాలో ఆయన యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పటికే దానికి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో ఆయన ప్రభాస్ కు తండ్రిగా నటించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆదిపురుష సినిమా తర్వాత ప్రభాస్ పెద్దగా బాలీవుడ్ యాక్టర్స్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆ సినిమాతో తన పరువు తీయాలని బాలీవుడ్ ట్రై చేసిందని, ప్రభాస్ కాస్త సీరియస్ గానే ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకే తన సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ ఎవరిని తీసుకోవద్దని, డైరెక్టర్లకు అలాగే ప్రొడ్యూసర్లకు ప్రభాస్ చెప్పేసాడని వార్తలు వచ్చాయి. అయితే కథకు అనుపమ్ ఖేర్ అయితే బాగుంటుందని డైరెక్టర్ ఒప్పించడంతోనే ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం.