Google Pani Puri: గూగుల్ డూడుల్‌గా పానీపూరీ.. ఇంత ప్రత్యేకత ఏంటి చెప్మా..?
పానీపూరి కాదు ఇది.. పంచామృతం అంటూ లొట్టలేసుకుంటూ తింటారు చాలామంది. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. పరాయిదేశ ప్రధాని కూడా పానీపూరి టేస్ట్ పొగిడారంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి పానీపూరికి అరుదైన గుర్తింపు లభించింది. గూగుల్ డూడుల్‌గా దర్శమిచ్చింది. పానీపూరికి ఇంత ప్రత్యేకత ఏంటి అసలు ?
పానీపూరి టేస్ట్ చేయని వారు అసలు ఉండరు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పిల్లలు, పెద్దలు.. అందరూ ఇష్టంగా తింటుంటారు. ఆ పూరీ, ఆ పానీలో ఉన్న మ్యాజిక్ అలాంటిది మరి! మనదగ్గరే కాదు.. దక్షిణాసియాలోని చాలా దేశాల్లో పానీపూరీలు కనిపిస్తుంటాయ్. వివిధ ప్రాంతాల్లో రకరకాల రుచులతో పానీ పూరీలు ఫుడ్ లవర్స్ నోరూరిస్తూ ఉంటాయ్. ఇప్పుడు అవే పానీ పూరీలు ఏకంగా గూగుల్ ముఖచిత్రంగా భావించే డూడుల్ పైనే చోటు సంపాదించుకున్నాయ్. గూగుల్ సెర్చ్ బార్ చూస్తే పానీపూరీలు టక్కున మెరుస్తున్నాయ్ ఇప్పుడు. దీనికి పెద్ద కారణమే ఉందండోయ్. పానీపూరీలు ప్రపంచ రికార్డ్ సాధించడమే దీనికి రీజన్.
2015లో సరిగ్గా ఇదే రోజు.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉన్న ఓ రెస్టారెంట్ ఏకంగా 51 రకాల పానీ పూరీలు తయారుచేసి వాల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో భారత్‌లో పానీపూరీలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ ఘటన జరిగి 8ఏళ్లు పూర్తి కావడంతో.. దానికి గుర్తుగా గూగుల్ తన డూడుల్ పై పానీ పూరీలను ఉంచింది. డూడుల్‌లో పెట్టడమే కాదు.. పానీపూరి గేమ్ కూడా లాంచ్ చేసింది గూగుల్. ఈ ఆటలో ఓ ప్లేయర్ ప్లేట్‌ను పట్టుకున్న చేతిని కంట్రోల్ చేస్తుంటాడు. పూరీలను గాలిలోకి షూట్ చేయడానికి, నోటితో వాటిని పట్టుకోవడానికి ప్లేట్‌పై క్లిక్ చేయాలి. ఎంత ఎక్కువ పూరీలు నోటికి చిక్కితే అంత ఎక్కువ స్కోర్ పొందవచ్చు.
సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయ్. క్యాండీక్రష్‌లాంటి మరో గేమ్‌ని కూడా డూడుల్ క్రియేట్ చేసింది. గూగుల్ డూడుల్‌లో మీరు అబ్జర్వే చేశారో లేదో.. చేసి ఉంటే ఇంకెందుకు ఆలస్యం.. వెళ్లి పానీ పూరీ గేమ్ ఆడండి. ఏమైనా గూగుల్ డూడుల్ మీద పానీపూరిని చూసి.. ఇది సార్ క్రేజ్ అంటూ పానీపూరీ లవర్స్ పోస్టులు పెడుతున్నారు.