నాలుగోరోజే అసలు సవాల్, చుక్కలు చూపిస్తున్న సర్ఫరాజ్, పంత్
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు వర్షంతో ఆట మొత్తం రద్దవగా... రెండోరోజు పూర్తిగా కివీస్ దే ఆధిపత్యంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకే కుప్పకూలడం... తర్వాత న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేయడం ద్వారా భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు వర్షంతో ఆట మొత్తం రద్దవగా… రెండోరోజు పూర్తిగా కివీస్ దే ఆధిపత్యంగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46 పరుగులకే కుప్పకూలడం… తర్వాత న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ చేయడం ద్వారా భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. దీంతో మూడోరోజు రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఎలా ఆడుతుందో అన్న సందేహాల మధ్య మన బ్యాటర్లు సత్తా చాటారు. టాపార్డర్ లో ముగ్గురు కీలక ఆటగాళ్ళు హాఫ్ సెంచరీలు చేశారు. జైశ్వాల్ 35 రన్స్ కే వెనుదిరిగినా… కెప్టెన్ రోహిత్ శర్మ ఫిఫ్టీ కొట్టాడు. చాలా రోజు తర్వాత ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ వరుసగా 4, 6, 4 బౌండరీ బాది అర్ధశతకం సాధించాడు. 63 బంతుల్లో రోహిత్ శర్మ 53 పరుగులు చేశాడు.
అయితే మూడోరోజు భారత్ ఇన్నింగ్స్ ను నిలబెట్టింది మాత్రం కోహ్లీ, సర్ఫరాజ్ జోడీనే… ఓపెనర్లు ఔటైన తర్వాత కివీస్ బౌలర్లు పట్టుసాధించకుండా వీరిద్దరూ అడ్డుగోడలగా నిలబడ్డారు. ఎలాగైనా ఫామ్ లోకి రావాలన్న పట్టుదల కోహ్లీలో కనిపించింది. దానికి తగ్గట్టుగానే తొలి సింగిల్ తీసేందుకు చాలా బాల్స్ ఆడిన కోహ్లీ తర్వాత తనదైన క్లాసిక్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అటు సర్ఫరాజ్ ఖాన్ దూకుడుగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన ఈ యువ బ్యాటర్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మూడో వికెట్ కు వీరిద్దరూ 136 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే దురదృష్టవశాత్తూ మూడోరోజు ఆట చివరి బంతికి కోహ్లీ ఔటవడం నిరాశ కలిగించింది. సెంచరీ చేస్తాడనుకున్న విరాట్ 70 పరుగులకు ఔటయ్యాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్ 386 పరుగులు చేయగా… కివీస్ కంటే 30 పరుగులు లీడ్ లో ఉంది. పిచ్ బ్యాటింగ్ తో పాటు స్పిన్నర్లకూ అనుకూలంగా ఉండడంతో నాలుగోరోజు తొలి సెషన్ చాలా కీలకమని చెప్పొచ్చు. సర్ఫరాజ్ దూకుడుకు పంత్ దూకుడు కలవడంతో భారత్ లీడ్ లోకి వచ్చింది. సర్ఫరాజ్ 137 పరుగులు, పంత్ 83 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కివీస్ కు సవాల్ విసరాలంటే నాలుగోరోజంతా భారత్ బ్యాటింగ్ చేయాల్సిందే. పంత్ బ్యాటింగ్ కు వచ్చే అవకాశం లేదని భావించినా వచ్చి దుమ్ము రేపాడు. రెండోరోజు కీపింగ్ చేస్తూ గాయపడిన పంత్ స్థానంలో ధృవ్ జురెల్ కు సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా వచ్చాడు. అయితే ఆసీస్ తో సిరీస్ నేపథ్యంలో పంత్ ను బ్యాటింగ్ ఆడిస్తారా అనే అనుమానాలకు పంత్ ఆట తీరుతో సమాధానం చెప్పాడు. మొత్తం మీద నాలుగోరోజు భారత్ ఆట ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైట్ చేయబోతోంది