జయహో పారా అథ్లెట్స్.. భారత్ కు 29 పతకాలు
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. గత రికార్డులను తిరగరాస్తూ ఈ సారి మన పారా అథ్లెట్లు దేశానికి అత్యధిక పతకాలు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా 29 పతకాలు గెలిచారు.
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. గత రికార్డులను తిరగరాస్తూ ఈ సారి మన పారా అథ్లెట్లు దేశానికి అత్యధిక పతకాలు అందించారు. మునుపెన్నడూ లేని విధంగా 29 పతకాలు గెలిచారు. పారిస్ వేదికగా జరిగిన పారా విశ్వ క్రీడల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. దీంతో ఈసారి భారత్ పారాలింపిక్స్ పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. కనీసం 25 పతకాలు గెలవడమే లక్ష్యంగా పారిస్ లో అడుగుపెట్టిన మన పారాబృందం దాని కంటే 4 మెడల్స్ ఎక్కువే సాధించింది. ఈ సారి అత్యధిక మెడల్స్ అథ్లెటిక్స్‌లోనే వచ్చాయి. తెలంగాణ అమ్మాయి దీప్తి జీవన్ జీ కూడా పారాలింపిక్స్ 400 మీటర్ల రేసులో కాంస్యం గెలిచింది.