Janhvi Kapoor : జాన్వీకి పక్షవాత సూచనలు..టెన్షన్ లో ఫ్యాన్స్..
జాన్వీ కపూర్ ఎగసి పడుతున్న యువ కెరటం. బాలీవుడ్ థడక్ అంటూ వచ్చేసిన బ్యూటీ టాలీవుడ్ లో జోరును కంటిన్యూ చేయాలనుకుంటోంది.

Paralysis indications for Janhvi..Fans in tension..
జాన్వీ కపూర్ ఎగసి పడుతున్న యువ కెరటం. బాలీవుడ్ థడక్ అంటూ వచ్చేసిన బ్యూటీ టాలీవుడ్ లో జోరును కంటిన్యూ చేయాలనుకుంటోంది. బాలీవుడ్ టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులను కొట్టేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. వయసుకు మించినపాత్రలు చేస్తూ తనకంటూ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది. ఓవైపు సినిమాలు , షూటింగ్స్, ప్రమోషన్స్ మరో వైపు ఈవెంట్స్, వివాహాలు అంటూ తెగచక్కర్లు కొడుతోంది. దీంతో ఫుడ్ ఫాయిజన్ తో ఆస్పత్రిలో సెన్సేషన్ గా మారితే.. బయటకు వచ్చిన తర్వాత బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి
ప్రజెంట్ కోలుకున్న జాన్వీ… ఫుడ్ పాయింజన్ కు సంబంధించినవిషయాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వరుస జర్నీలతో పాటు జంక్ ఫుడ్ తీసుకోవడం తో కడుపు నొప్పి వచ్చిందని… ఆ తర్వాత వణుకు వచ్చేయడం భయమేసిందన్నారు. అంతేకాక తనకు పక్షవాతం వచ్చిందేమోనని తెగ టెన్షన్ పడిపోయానని… కనీసం వాష్ రూం కి కూడా వెళ్లలేకపోయానని చేదు విషయాలను షేర్ చేసుకుని ఎమోషన్ అయింది.
జాన్వీ కెరీర్ విషయానికి వస్తే… ప్రజెంట్ బాలీవుడ్ బ్యూటీనటించిన ఉలజ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో పాటు టాలీవుడ్ లో బ్యూటీ నటిస్తున్న దేవర మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సెప్టెంబర్ లో మూవీ రిలీజ్ కానుంది. ఇక దేవర కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఆర్సీ 16 లో పవర్ ఫుల్ రోల్ లో బ్యూటీ నటించనుంది. మొత్తానికి వరుస సినిమాలతో బిజీ గా ఉన్న బ్యూటీ… మరింత ఉన్నత స్థితి కి చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతే విధంగా హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.