Paritala Sriram: ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు టికెట్ కష్టమేనా? లిస్ట్‌లో పేరు లేనిది ఇందుకేనా..?
ఫస్ట్ లిస్ట్‌లో 94మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించగా.. 24సీట్లలో 5 స్థానాలకు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది జనసేన. ఐతే అనంతపురం జిల్లాలో కీలక నేతగా ఉన్నా.. పరిటాల శ్రీరామ్ పేరు కూడా లిస్ట్‌లో లేకపోవడం.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

Paritala Sriram: అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన కలిసి తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి ఉమ్మడి జాబితా ప్రకారం.. టీడీపీ 94, జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయని.. జనసేన 3పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్‌లో 94మంది అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించగా.. 24సీట్లలో 5 స్థానాలకు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది జనసేన. చాలామంది సీనియర్లకు ఈ లిస్ట్‌లో టికెట్ దక్కలేదు. ఐతే అనంతపురం జిల్లాలో కీలక నేతగా ఉన్నా.. పరిటాల శ్రీరామ్ పేరు కూడా లిస్ట్‌లో లేకపోవడం.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
PAWAN KALYAN: ఎంపీగా పవన్..? పవన్ నిర్ణయంతో పిచ్చెక్కిపోతున్న జనసైనికులు
ఆయన ధర్మవరం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఐతే ఆ స్థానంతో పాటు.. మరో నాలుగు నియోజకవర్గాలను టీడీపీ హోల్డ్‌లో పెట్టింది. దీంతో ధర్మవరంలో ఏం జరగబోతోంది. ఎవరు పోటీ చేయబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి పాదయాత్ర సమయంలో.. పరిటాల శ్రీరామ్‌ను లోకేశ్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు కూడా ! శ్రీరామ్‌కు మీ ఆశీర్వాదం కావాలి అంటూ.. సభలో విన్నపాలు కూడా చేశారు. అలాంటి శ్రీరామ్‌కు ఫస్ట్ లిస్ట్‌లో ప్లేస్ లేకపోవడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఐతే శ్రీరామ్ తల్లి సునీతకు.. రాప్తాడు నుంచి టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. గత ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు అదే ఫాలో అవుతుందా.. అదే జరిగితే ధర్మవరంలో శ్రీరామ్‌కు టికెట్ డౌటేనా అనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేశారు. కొడుకు బరిలో దిగడంతో.. సునీత పోటీకి దూరంగా ఉన్నారు. ఐతే ఇప్పుడు రాప్తాడుతో పాటు.. ధర్మవరం మీద కూడా పరిటాల కుటుంబం ఫోకస్ పెట్టింది. రాప్తాడులో సునీత, ధర్మవరంలో శ్రీరామ్ గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు.
శ్రీరామ్ పోటీ చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో.. ఆ స్థానాన్ని హోల్డ్ చేయడం వెనక రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయ్. టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా కలుస్తుందనే ప్రచారం జరుగుతున్న వేళ.. శ్రీరామ్ టికెట్ మీద మరిన్ని డౌట్స్ వస్తున్నాయ్. బీజేపీ తరఫున ధర్మవరంనుంచి గోనుగుంట్ల సూరి టికెట్ ఆశిస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సూరి.. 2019 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. పొత్తు కుదిరితే కమలం పార్టీ డిమాండ్ చేసే స్థానాల్లో ధర్మవరం కూడా ఒకటి. ఐతే బీజేపీ నుంచి క్లారిటీ రావాలనే.. ఈ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదనే టాక్‌వినిపిస్తోంది. ఏమైనా ఇప్పుడు పరిటాల శ్రీరామ్ టికెట్ మీద ఇప్పుడు రకరకాల అనుమానాలు మొదలయ్యాయ్.