Parliament Budget : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు.

Parliament budget meetings.. Nirmala Sitharaman will introduce the budget
కేంద్రంలరో మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం నేడు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సభామోదం కోసం ప్రభుత్వం తీసుకురానుంది.
నేడు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి..
ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. FY24 (2023-24)లో భారత్ ఆర్థిక స్థితి, సాధించిన వృద్ధి మొదలైన అంశాలపై ఈ సర్వే అవగాహన కల్పిస్తుంది. బడ్జెట్‌ను అంచనా వేయడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన 2024 బడ్జెట్ కూడా జూలై 23నే పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, రైలు ప్రమాదాలు, కన్వర్ యాత్ర ఘటన వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ సందర్భంగా వీటిపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెడతారు.