Parliament Winter Session: పార్లమెంట్ నుంచి 92 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్.. ఒకే రోజు 78 మంది సస్పెన్షన్..

గతవారం లోక్‌సభలో స్మోక్ గ్యాస్‌తో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. ఈ ఘటన పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో సభ్యుల భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 05:42 PMLast Updated on: Dec 18, 2023 | 5:42 PM

Parliament Winter Session 92 Mps Suspended From Rajya Sabha And After Lok Sabha

Parliament Winter Session: పార్లమెంట్‌పై ఇటీవల జరిగిన దాడి ఘటన ఉభయ సభల్లో విపక్ష సభ్యుల ఆందోళనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విపక్ష సభ్యుల్ని సస్పెండ్ పార్లమెంట్ చేసింది. లోక్‌సభ, రాజ్యసభలో కలిపి ఒకే రోజు 78 మంది సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ఇందులో లోక్‌సభ నుంచి 33 మందిని, రాజ్యసభ నుంచి 45 మందిని సస్పెండ్ చేసింది. అంతకుముందు గత శుక్రవారం 13 మందిని సస్పెండ్ చేసింది. మొత్తం ఉభయ సభల నుంచి 92 మంది సభ్యుల్ని స్పీకర్లు సస్పెండ్ చేశారు.

YS JAGAN: మేనల్లుడిని కూడా పట్టించుకోని జగన్‌.. టార్గెట్ అంతా దాని మీదే..

గతవారం లోక్‌సభలో స్మోక్ గ్యాస్‌తో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ.. ఈ ఘటన పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో సభ్యుల భద్రతపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంట్ భద్రతపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శిస్తూ, ప్రశ్నించాయి. విపక్ష సభ్యుల ఆందోళనతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. సభా కార్యకలాపాలకు ఆందోళన కలుగుతుండటంతో, ఇందుకు కారణమైన సభ్యుల్ని సభల నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి కూడా ఉన్నారు. లోక్‌సభలో సోమవారం నాడు 33 మంది సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వీరిలో 30 మందిని శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

మిగతా ముగ్గురు (కే.జయ కుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఖ్) సస్పెన్షన్ గడువుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీళ్లు స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా లోక్‌సభ నుంచి 46 మంది ఎంపీలపై, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలపై ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. అంతకుముందే రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్‌పై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఉభయ సభల్ని మంగళవారానికి వాయిదా వేశారు. పార్లమెంటుపై దాడి ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.