Passport services : హైదరాబాద్ లో పాస్ పోర్ట్ సేవలు బంద్
హైదరాబాద్లోని నగరంలోని పాస్పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఒక రోజు రెండు కాదు ఒకేసారి ఐదురోజులుగా ఇదే జరుగుతుంది.

Passport services closed in Hyderabad
హైదరాబాద్లోని నగరంలోని పాస్పోర్టు కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. ఒక రోజు రెండు కాదు ఒకేసారి ఐదురోజులుగా ఇదే జరుగుతుంది. బేగంపేట, అమీర్పేట, టోలిచౌకిల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ను అధికారులు నిలిపివేశారు. దీంతో నగరవాసులు పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో ఈ కేంద్రాలకు స్లాట్లు ఉన్నట్లు కనిపించడంతో దీంతో నేరుగా పెద్ద సంఖ్యలో నగరవాసులు పాస్ పోర్టుల కార్యాలయాలవద్ద బారులు తీరారు. ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి ఫిర్యాదులు పంపుతున్నా స్పందించే వారు లేరని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.