Pavan Kalyan Campaign: ఒక్కరోజు ప్రచారానికే పవన్ డీలా…. అయోమయంలో జనసేన కేడర్ !
జనసేనాని పవన్ కల్యాణ్ కి ఏమైంది... మూడు రోజుల పిఠాపురంలోనే పర్యటిస్తా.... అక్కడే మకాం పెడతా... నియోజకవర్గాన్ని చుట్టేస్తా అని చెప్పారు...... కానీ జ్వరం వచ్చిందంటూ... సాయంత్రానికి హెలికాప్టర్ ఎక్కి చలో హైదరాబాద్ అన్నారు. జనసేన ఎన్నికల ప్రచారం కోసం ఏప్రిల్ 2 దాకా పిఠాపురంలోనే ఉండాల్సిన పవన్... ఏదో మచ్చుకు వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. పిఠాపురం- హైదరాబాద్ డైలీ సర్వీస్ చేస్తున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ కి (Pavan Kalyan) ఏమైంది… మూడు రోజుల పిఠాపురంలోనే పర్యటిస్తా…. అక్కడే మకాం పెడతా… నియోజకవర్గాన్ని చుట్టేస్తా అని చెప్పారు…… కానీ జ్వరం వచ్చిందంటూ… సాయంత్రానికి హెలికాప్టర్ ఎక్కి చలో హైదరాబాద్ అన్నారు. జనసేన (Janasena) ఎన్నికల ప్రచారం కోసం ఏప్రిల్ 2 దాకా పిఠాపురంలోనే ఉండాల్సిన పవన్… ఏదో మచ్చుకు వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. పిఠాపురం- హైదరాబాద్ డైలీ సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు జ్వరం అంటూ హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. మండుటెండల్లో రెండు రోజులు తిరిగే సరికి… పవన్ ఆరోగ్యం దెబ్బతిన్నది. పైగా అభిమానులు పూలు చల్లడంతో ఎలర్జీ వచ్చినట్టు చెబుతున్నారు.
ఏపీలో 21 అసెంబ్లీ సీట్లల్లో జనసేన పోటీ చేస్తోంది. అంటే పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంతో (Pitapuram) పాటు మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. ఇది కాకుండా రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు… అప్పుడప్పుడూ బీజేపీ, టీడీపీ అధినేతలు, ఢిల్లీ పెద్దలతో కలసి బహిరంగ సభలు, రోడ్ షోల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అంతా ఎండాకాలమే ఉంది. పైగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజు ప్రచారానికే పవన్ కి జ్వరం వస్తే… రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటని జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళన పడుతున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటారని వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) తరుచుగా విమర్శిస్తూ ఉంటారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి పవన్ నిజంగానే హైదరాబాద్ లోనే ఎక్కువ టైం గడుపుతున్నారు. పాలిటిక్స్ అంటేనే నిత్యం జనంలో తిరగాలి… ఎండా వానలను లెక్కచేయకుండా జనంలో ఉంటేనే వాళ్ళ అభిమానాన్ని గెలుచుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది… నేతలంతా రోడ్ల మీద ఉంటే… పవన్ ఇలా చేయడమేంటని కేడర్ లో అయోమయం ఏర్పడింది. పిఠాపురంలో ఒక్కరోజు పర్యటనకే ఇలా అయితే… తమ పరిస్థితి ఏంటని పోటీలో ఉన్న జనసేన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరి రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాక అయినా… పవన్ తగిన జాగ్రత్తలతో జనంలో తిరుగుతారా… పిఠాపురం నుంచి వారాహి యాత్రను (Varahi yatra) మొదలుపెడతారా… జనసైనికులు మాత్రం తమ అధినేత కోసం ఎదురు చూస్తున్నారు.