PAWAN KALYAN: ఆ గులకరాయి వెనుక ఉన్నదెవరో తేల్చండి !! పవన్ సంచలన ట్వీట్
పోలీసుల భద్రతా వైఫల్యంపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలంటూ ECకి కూడా మెస్సేజ్ ట్యాగ్ చేశారు పవన్ కల్యాణ్. సీఎంపై గులకరాయితో దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యాలకు కారణమైన వాళ్ళతో ఎలా విచారణ చేయిస్తారని ప్రశ్నించారు జనసేనానికి పవన్ కల్యాణ్.

PAWAN KALYAN: ఏపీ సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. గులకరాయి విసిరిన చేయి.. దానిక వెనుక ఉన్నదెవరో నిగ్గు తేల్చాలన్నారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టాలంటూ ECకి కూడా మెస్సేజ్ ట్యాగ్ చేశారు పవన్ కల్యాణ్. సీఎంపై గులకరాయితో దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యాలకు కారణమైన వాళ్ళతో ఎలా విచారణ చేయిస్తారని ప్రశ్నించారు జనసేనానికి పవన్ కల్యాణ్.
Kangana Ranaut: కింగ్ వర్సెస్ క్వీన్.. మండిలో గెలుపెవరిది..? కంగనా పరిస్థితి ఏంటి..?
జగన్ ఏ పర్యటనకు వెళ్ళినా పరదాలు కట్టి, చెట్లు కొట్టేసేవారు. అప్పట్లో అన్నీ పట్టపగలే నిర్వహించారు. మరి విజయవాడలో ఏ ఉద్దేశ్యంతో కరెంట్ నిలిపేసి.. చీకట్లో యాత్ర చేయించారని ప్రశ్నించారు పవన్. దాడిని అడ్డుకోవడంలో విఫలమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యానికి కారణమైన వారిని వెంటనే బదిలీ చేసి.. నిజాయతీ కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగించాలన్నారు. రాళ్ళు వేసినవారు.. ఆ చేయి వెనక ఉన్నవాళ్ళెవరో అప్పుడే బయటపడుతుందని ట్వీట్ చేశారు.
పీఎం మోడీ పర్యటన టైమ్‌లోనూ భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. ఇలాంటి అధికారులతో ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలని కోరారు పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి.. చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ…
— Pawan Kalyan (@PawanKalyan) April 15, 2024