Pavan wife help : పేద పిల్లలకు పవన్ కల్యాణ్ భార్య అనా సాయం
జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ భార్య అనా కొణిదెల కొత్త సంవత్సరం వేడుకలను అనాథల మధ్య జరుపుకున్నారు. ఐదుగురు బాలికల చదువులకు ఫీజులు చెల్లించారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భార్య అనా కొణిదెల కొత్త సంవత్సర వేడుకలను హైదరాబాద్ లోని అనాథ శరణాలయంలో జరుపుకుంది. నారపల్లిలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడి అనాథ బాలబాలికలతో ముచ్చటించి కేక్ కట్ చేశారు. వారి చదువుల గురించి తెలుసుకున్నారు. ఐదురు బాలికల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లించారు అనా కొణిదెల. వారి ఫీజుల మొత్తాన్ని NGO నిర్వాహకులకు అందించారు. శరణాలయానికి కావల్సిన నిత్యావసర సరకులు, బాలలకు అవసరమైన సామగ్రిని ఆమె అందించారు.