PAWAN KALYAN: రెండు సీట్లు ప్రకటించిన జనసేన.. టీడీపీ సీట్ల ప్రకటనపై పవన్ ఆగ్రహం
ఇటీవల చంద్రబాబు నాయుడు.. మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగానే తాను కూడా రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. టీడీపీలాగే తనకూ పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉందని పవన్ అన్నారు.

PAWAN KALYAN: రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకున్న టీడీపీ, జనసేనలు పరస్పరం అభ్యర్థుల్ని ప్రకటించుకుంటున్నాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండానే సీట్ల ప్రకటన జరుగుతోంది. తాజాగా రాజోలు, రాజంపేట స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సమావేశంలో జనసేన అధినేత పవన్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవికి పద్మవిభూషణ్.. ఆయన సాధించిన అవార్డులు ఇవే
ఇటీవల చంద్రబాబు నాయుడు.. మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగానే తాను కూడా రెండు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. టీడీపీలాగే తనకూ పార్టీ లీడర్ల నుంచి ఒత్తిడి ఉందని పవన్ అన్నారు. అందుకే అందుకే ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్టు పవన్ చెప్పారు. చంద్రబాబుకు పవన్ సూచన చేశారు. కలిసి ముందుకు వెళ్తేనే బలమైన నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఎప్పుడూ జనసేన బలం ఇచ్చేవాళ్లుగా అవుతున్నారేగానీ.. తీసుకునే పరిస్థితులో లేకుండా పోతున్నామనని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ కోసం 50-70 స్థానాలు తీసుకోవాలని తనకు తెలియనిది కాదని, కానీ ఒంటరిగాపోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయో లేదో తెలియదుని పవన్ అన్నారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టమని.. విడదీయం చాలా తేలికన్నారు. అందుకే తనకు ఎప్పుడూ కలపడమే ఇష్టమని పవన్ పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఆయన తనయుడు లోకేష్ అన్నారని, అయితే.. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాను మౌనంగా ఉంటున్నట్లు చెప్పారు. పొత్తులు, సీట్లు సర్దుబాటు అంటే టీడీపీ వాళ్లకు ఇరుకు చొక్కా తొడుక్కున్నట్టు ఉంటుందన్నారు. అందుకే అనుకోకుండా కొన్ని జరుగుతాయని, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం 2024లో మళ్ళీ అధికారంలోకి రాకూడదని వివరించారు. చంద్రబాబు.. పొత్తు ధర్మం ప్రకారం సీట్లు ప్రకటించకుండా ఉండాల్సిందన్నారు. ఈ విషయంలో తన పార్టీ లీడర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.