Pawan Kalyan: పాకిస్థాన్‌లో పవన్ కళ్యాణ్ హవా
పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి పాకిస్తాన్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

Pawan Kalyans Bro Moive Good Views In Pakistan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చెప్తే తెలుగు ఆడియన్స్‌లో కనిపించే వైబ్రేషన్స్ వేరు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. సిల్వర్ స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే. అది పవర్‌స్టార్ రేంజ్. కేవలం ఇండియాలోనే కాదు శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా ఇప్పుడు పవర్ స్టార్ హవా నడుస్తోంది. రీసెంట్‌గా రిలీజైన బ్రో సినిమాకు పాకిస్థాన్‌లో ఓ రేంజ్‌లో వ్యూస్ వస్తున్నాయి. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాను రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన దగ్గరి నుంచి బ్రో సినిమా టాప్‌లో కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గా ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇండియాలో నెంబర్ 1 లో ఉండగా.. నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్ట్‌లో టాప్ 7లో నిలిచింది. అలాగే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో టాప్ 8లో ఉంది. దీంతో పవన్‌కల్యాణ్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. పాకిస్థాన్‌లో పవన్ క్రేజ్ చూసి కాలర్ ఎగరేస్తున్నారు. తెలుగులో అనుకున్న స్థాయి కలెక్షన్స్ ఇవ్వకపోయినా ఓటీటీలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. ఈ స్థాయిలో పాకిస్థాన్‌లో ఆదరణ పొందిన తెలుగు సినిమా ఇదే కావడం అదీ పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.