PAWAN KALYAN ON KRISHNA: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల దగ్గర పడుతున్నకొద్దీ లీడర్ల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. వీటికి సోషల్ మీడియాలో ఆయా పార్టీలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణను జనసేనాని పవన్ కల్యాణ్ అవమానించారంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. అటు జనసేన ఈ ఆరోపణలను ఖండిస్తూ ట్వీట్స్ చేస్తోంది. ఏపీలో పొలిటికల్ లీడర్లతో పాటు.. వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలు కూడా అంతే యాక్టివ్ గా ఉంటున్నాయి.
KALKI 2898 AD: కల్కి అమితాబ్ యంగ్ లుక్‌పై రచ్చ.. కొరటాల తప్పే నాగి చేస్తున్నాడా ?
అవతలి పార్టీ లీడర్ మాట్లాడిన దాంట్లో లొసుగులు వెతుకుతూ వాటిని హైలెట్ చేస్తోంది ప్రత్యర్థి పార్టీ. ఇప్పుడు సూపర్ కృష్ణ విషయంలో అదే జరుగుతోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎంతో సంస్కారవంతంగా ఉన్నారనీ.. అతనికి మిగతా నటుల నుంచి సరైన సహకారం అందలేదని ఓ మీటింగ్‌లో చెప్పారు పవన్ కల్యాణ్. కృష్ణ లాంటి నటులు వేరే పార్టీలో ఉండి.. విమర్శించినా ఎన్టీఆర్ సంస్కారంగా, హుందాగా వ్యవహరించినట్టు చెప్పుకొచ్చారు. పవన్ మాటలను తీసుకొని.. నటశేఖర్ కృష్ణను పవన్ కల్యాణ్ అవమానించారంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది వైసీపీ. సంస్కారవంతుడి గురించి సంస్కార హీనుడు చెబుతున్నాడని కామెంట్ చేస్తూ పవన్ మాటలను హైలెట్ చేసింది. పరోక్షంగా కృష్ణ, మహేశ్ అభిమానులకు ఆగ్రహం పెంచుతోంది. ఎన్టీఆర్ మాత్రమే సంస్కారవంతుడా.. కృష్ణ కాదా అని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
అటు జనసేన మీడియా.. పవన్ కామెంట్స్ సమర్థిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు సంస్కారం ఉందని చెబితే.. కృష్ణకు లేదని అన్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళ నుంచి హుందా రాజకీయాలను జగన్ నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి నీతిమాలిన పోస్టులు, పనులు చేస్తున్న జగన్‌ను తన్ని తరిమేయాలని కృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని జనసేన కోరుతోంది. తనకు సినిమా హీరోలంతా సమానమేనని పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతుంటారు. కొన్ని మీటింగ్స్‌లో మహేశ్ బాబు, ప్రభాస్ పేర్లు కూడా ప్రస్తావించారు. కానీ ఇప్పుడు పవన్ మాటలను మహేశ్ బాబు ఎలా తీసుకుంటారో చూడాలి.