PAWAN KALYAN: పిఠాపురంలో ఇల్లు కొంటా.. వైసీపీ ఫ్యాన్‌కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ: పవన్ కళ్యాణ్

పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలిపిస్తా అన్నారు. ఎప్పుడూ రుణపడి ఉంటాను. రాష్ట్రం మొత్తం తిరిగే నేను పిఠాపురం వదిలేస్తా అనుకోవద్దు. ఓడిపోయినా దశాబ్దాంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నా. పిఠాపురంలో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ తీసుకువస్తా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2024 | 09:33 PMLast Updated on: Mar 30, 2024 | 9:33 PM

Pawan Kalyan Comments On Ysrcp And Urged Peple To Vote Janasena

PAWAN KALYAN: తనను గెలిపిస్తే పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఇల్లు కొంటానని, అక్కడే ఉంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి విజయభేరి యాత్ర పేరిట పవన్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. “పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదు. సమస్యలు నావి అనుకున్నాను తప్ప.. నియోజకవర్గం గురించి ఆలోచించలేదు.

YS JAGAN: జగన్ పర్యటనలో చెప్పు విసిరిన వ్యక్తి.. నీళ్ల కోసం నిలదీసిన జనం..

పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలిపిస్తా అన్నారు. ఎప్పుడూ రుణపడి ఉంటాను. రాష్ట్రం మొత్తం తిరిగే నేను పిఠాపురం వదిలేస్తా అనుకోవద్దు. ఓడిపోయినా దశాబ్దాంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నా. రెండు చేతులు జోడించి ఆర్జిస్తున్నా. నన్ను గెలిపించండి. మీ ఆశీర్వాదం కావాలి. నేను మీకు సేవ చేస్తా. పిఠాపురంలో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ తీసుకువస్తా. పిఠాపురం అభివృద్ధి కి 12 నుంచి 14 పాయింట్స్ పార్ములా ఉంది. పవన్ కళ్యాణ్ మీకు జవాబుదారీ. నేను పారిపోను. నన్ను ఓడించడానికి చిత్తూరు నుంచి మిధున్ రెడ్డి వచ్చాడు. పట్టుమని 25 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టలేని నేను అంటే ఎందుకు కక్ష. మండలానికి ఒక నాయకుడు ఎందుకు వచ్చాడు..? కాకినాడ మాఫియా డాన్ నన్ను ఓడిస్తాడా..? ఆలయాలు ద్వంసం చేసిన ఎంత మందిని పట్టుకున్నారని వంగా గీతను అడగండి.

తలకి ఎంత మదం ఎక్కితే ఇలా మాట్లాడతారు. నేను గెలిచిన తర్వాత కాకినాడ మాఫియా డాన్‌ను పిఠాపురం రమ్మను. తాటాకు చప్పుళ్ళకి భయపడను. తోలు తీస్తాను. కాకినాడ పోర్ట్‌లో ఎన్నికల ఖర్చుకి డబ్బులు కంటైనర్‌లలో పెట్టారు. కాకినాడ పోర్ట్ డ్రగ్ మాఫియా, బియ్యం మాఫియా, ఆయిల్ మాఫియాకి కేంద్రంగా మారింది. వైసీపీ ఫ్యాన్‌కి సౌండ్ ఎక్కువ. గాలి తక్కువ. పొత్తు ధర్మంలో జనసేనని గెలిపించే బాధ్యత తీసుకున్న వర్మకి కృతజ్ఞతలు” అని పవన్ వ్యాఖ్యానించారు.