PAWAN KALYAN: జగన్.. అభివృద్ధి బటన్ నొక్కు.. ఆ మాటతో జాతీయ నేతలతో తిట్లు తిన్నా: పవన్ కళ్యాణ్

అన్ని కులాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారు. కాపు కులంలో పుట్టినంత మాత్రాన కాపుల కోసమే పని చేస్తానని చెప్పడం లేదు. అందరి కోసం పనిచేస్తా. ఈమధ్య వైసిపికి 50 సీట్లు కూడా రావని బెట్టింగులు జరుగుతున్నాయి అని విన్నాను. ఓడినా ఇదంతా జనసేనతోనే సాధ్యమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 07:49 PMLast Updated on: Feb 21, 2024 | 7:49 PM

Pawan Kalyan Criticised Ys Jagan In Bhimavaram Janasena Meeting

PAWAN KALYAN: అప్పులు తెచ్చి బటన్ నొక్కడం దేనికని, అభివృద్ధి చేసే బటన్ నొక్కాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భీమవరంలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. “మిగతా కులాల సంఖ్య బలం ఎక్కువ అయినా అధికారం మాత్రం జగన్‌దే. ఒక కులం ఎదగడం అంటే మరొక కులం తగ్గడం కాదు. అన్ని కులాలు సాధికారత సాధించే దిశగా ఆలోచన చేస్తున్నా. కులాల్లోని నాయకులు ఎదగడం కాదు.. కుల సమూహాలు లబ్ధి పొందాలి. నాయకులు కులాల్ని వాడుకుని ఎదుగుతున్నారు. ఆ పరిస్థితులు మారాలి. 2016 నుంచి సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టా. కులాల మధ్య పడకపోవడానికి ఇబ్బందులు ఏంటని ఆలోచన చేశా.

TDP SENIORS: సీటు గోవిందా.. టీడీపీలో సీట్ల సిగపట్లు.. సీనియర్లకీ టిక్కెట్లు డౌటే

అన్ని కులాల్లోనూ నాకు అభిమానులు ఉన్నారు. కాపు కులంలో పుట్టినంత మాత్రాన కాపుల కోసమే పని చేస్తానని చెప్పడం లేదు. అందరి కోసం పనిచేస్తా. ఒక జబ్బుకి మందు సరిగ్గా మాట్లాడడం. నమ్మింది బలంగా చెప్పడం. భావితరాలకు అవసరమైన నాయకులు కులాలని విడగొట్టే వాళ్ళు కాదు.. కులాల్ని కలుపుకొని వెళ్లే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అక్కున చేర్చుకుంటా. అన్నిచోట్ల కొత్త నాయకత్వం రావాలి. కొంతమంది నాయకులు అలసిపోయారు. జగన్.. కులాల్ని విచ్చినం చేసే వ్యక్తి. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు దళిత కులానికి చెందిన వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశారు. అతను జైలు నుంచి బయటకు వస్తే బాస్ ఇస్ బ్యాక్ అని 10,000 మంది ఆహ్వానం పలికారు. ఈ ఘటనతో కాపులపై దళితుల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. భీమవరం ఎమ్మెల్యేని వ్యతిరేకించవద్దని కొందరు చెబుతున్నారు. మా అన్నయ్యనే వ్యతిరేకించి రాజకీయాల్లో కొనసాగుతున్నా. మంచి చేద్దాం అంటే దగ్గర వాళ్ళే ముందరికాళ్ళకు బంధం వేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి వేల కోట్లు సంపాదించి ఇద్దరు బిడ్డలకు ఇస్తే చెల్లికి వాటాలు ఇవ్వడం లేదు. సొంత చెల్లికి వాటాలు ఇవ్వలేని వాడు మనకేమి పంచుతాడు. పార్టీని మోయడం కోసం ఎన్ని తిట్లైనా తిట్టించుకుంటా. అనుభవజ్ఞులకు తలవంచుతా. బిజెపిలో నాకు మొదట్లో మోడీ మాత్రమే తెలుసు. భారతదేశానికి ధృవతారాల గుర్తించి వచ్చిన వ్యక్తిని. మోడీని నమ్మి వస్తే నన్ను అనేక పేర్లతో పిలిచారు.

BRS-KCR: బీఆర్ఎస్‌ నీటి పోరు యాత్ర.. హైదరాబాద్‌లో భారీ సభకు ప్లాన్

నేను ఒక నాయకుడిని నమ్మితే చిత్తశుద్ధిగా నమ్మేస్తాను. పార్టీని నడపడం అంటే శాసించడం కాదు. అందరిని నడిపించడం. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని ఎవరికీ చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా 45 లక్షలు ఖర్చు పెంచింది. రాజకీయ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా.. వద్దా.. అనేది నేను చెప్పను. వేల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా సైలెంట్‌గా కూర్చుంటున్నారు. పదేళ్ల తర్వాత అయినా ఓట్లు కొనకుండా రాజకీయాలు జరగాలి. అప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం ఎందుకు..? అభివృద్ధి చేసే బటన్ నొక్కు..? అప్పుడు అందరూ గౌరవిస్తారు. భవిష్యత్తులో ఏ పథకాన్ని ఎవరూ ఆపలేరు అని జగన్ చెబుతున్నారు. అంటే మేము వచ్చి పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి కూడా చేస్తామని చెబుతున్నారు. అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వట్లేదు. కనీసం చెల్లికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. కొద్దిమంది నన్ను తిట్టే వైసీపీ నాయకులకి చెబుతున్నా.. మీకు భయపడి వెనక్కి వెళ్లే మనిషిని నేను కాదు. ఒక్కడినే నిలబడి ఓడిపోయినా.. తెలుగుదేశం పార్టీని నిలబెట్టే స్థాయికి వచ్చాం. మన దగ్గర సైన్యం ఉంది. కానీ, ఎన్నికలను సమర్థవంతంగా నడిపించే బలగం లేదు. ప్రజారాజ్యంలో 18 సీట్లు వచ్చినా పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. సీట్లు రాకపోయినా జనసేన పార్టీని నిలబెట్టుకున్నాం. 2019 ఓటమి తర్వాత నిర్ణయించుకున్నదొకటే.

Gorantla Butchaiah Chowdary: ఎన్టీఆరే కారణమా..? ఎన్టీఆర్‌ మీద కోపంతోనే గోరంట్లపై వేటు వేశారా?

ఏదేమైనా పార్టీని నిలబెట్టాలని. రెండు చోట్లా పోటీ చేయాలని అనుకోలేదు. గాజువాకతో పాటు మరొకటి అనుకున్నాను. భీమవరంలో పోటీ చేయమని కొంతమంది ఆహ్వానించారు. వాళ్లంతా ఇప్పుడు లేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నా ప్రాణాల పోతాయి అన్న బాధ ఉంటుంది నాకు. ఈమధ్య వైసిపికి 50 సీట్లు కూడా రావని బెట్టింగులు జరుగుతున్నాయి అని విన్నాను. ఓడినా ఇదంతా జనసేనతోనే సాధ్యమైంది. జగన్ జాలి పడుతున్నాడు తనని ఒంటరి వాడిని చేసారు అని.. అందర్నీ చావగొట్టి చెవులు మూస్తున్న నువ్వు ఒంటరి వాడివా జగన్..? నువ్వు సిద్ధమంటే మేము యుద్ధం అంటాం. మనం యుద్ధం చేయాల్సిన అంత గొప్పవాడు కాదు. సిద్ధం పోస్టుల గురించి కొంతమంది చెబితే సినిమా డైలాగులు మనకొద్దని చెప్పా. నువ్వు సిద్ధమంటే మేము యుద్ధమని చెబుతాం. నేను సింహం లాంటోడని సీరియస్‌గా జగన్‌కి చెప్పలేను. నిజజీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడుతా. విశాఖలో గోడలు బద్దలు కొట్టుకుని వెళ్దాం. టిడిపి, జనసేన, బిజెపి కలిసి ఉండాలని కోరుకుంటున్నా. అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు చీలకుండా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చి ఎంత నలిగిపోయానో నాకు తెలుసు. ఈ మాట వల్ల జాతీయ నాయకుల వద్ద ఎన్ని చీవాట్లు తిన్నానో నాకు తెలుసు. నేనెప్పుడూ జనసేన ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించలేదు. తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాను. పొత్తులు బలంగా నిలబడాలి. మనలో మనకి ఇబ్బందులు, త్యాగాలు తప్పవు. ప్రతి ఎన్నికల్లో మూడో వంతు బలంగా జనసేన తీసుకుంటుంది” అని పవన్ వ్యాఖ్యానించారు.