Pithapuram Issue: అసమ్మతి సెగ.. పవన్‌కు పిఠాపురం సీటు.. రచ్చ.. రచ్చ..
టీడీపీలో పిఠాపురం సీటు రచ్చ రేపుతోంది. ఆ సీటు నుంచి తానే పోటీ చేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. గెలిచే సీటు నాన్ లోకల్‌కు ఎలా ఇస్తారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Pithapuram Issue: అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. టీడీపీ-జనసేనలకు పొత్తుల కత్తులు గట్టిగా గుచ్చుకుంటున్నాయా..? అధినేతలను సైతం అసంతృప్త సెగలు ఠారెత్తిస్తున్నాయా..? పిఠాపురం పితలాటకం పవన్ నెత్తిన చుట్టుకుందా..? ప్రస్తుత పరిస్థితి చూస్తే.. కాక గట్టిగానే తగులుతోంది. దీనికి శుభం కార్టు ఎలా పడుతుందన్న ఉత్కంఠ ఇప్పుడు రేగుతోంది. టీడీపీలో పిఠాపురం సీటు రచ్చ రేపుతోంది. ఆ సీటు నుంచి తానే పోటీ చేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. గెలిచే సీటు నాన్ లోకల్‌కు ఎలా ఇస్తారంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ELECTORAL BONDS: అంతా సీక్రెట్.. 1000 కోట్లు ఇచ్చిన కాళేశ్వరం కాంట్రాక్టర్
గతంలో జనసేన కోఆర్డినేటర్‌గా వచ్చిన ఉదయ్ శ్రీనివాస్‌ను వ్యతిరేకించారు వర్మ. ఆయనతో కలిసి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇష్టపడలేదు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే ఆహ్వానిస్తాననీ.. ఆయన నియోజకవర్గానికి రాకుండానే సీటును గెలిపించి గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు వర్మ. కానీ సడన్‌గా పవన్ స్టేట్‌మెంట్ రావడంతో టెన్షన్ పడుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారన్న సమాచారంతో.. వర్మ అనుచరులు పిఠాపురం టీడీపీ ఆఫీస్ దగ్గర రచ్చ చేశారు. హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలంటూ వర్మపై ఒత్తిడి తెస్తున్నారు అనుచరులు. మరోవైపు నియోజకవర్గంలో జనసేన కేడర్ కూడా బైక్ ర్యాలీ నిర్వహించింది. స్వయంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే ఇలా అసమ్మతి వినిపించడం సరికాదని సూచిస్తున్నారు. తమ ఆందోళనలతో పవన్‌కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు వర్మ. టీడీపీపైనే తమ పోరాటం అని అంటున్నారు. కార్యకర్తలు, ప్రజల అభీష్టంతో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
మరోవైపు.. టీడీపీలో మెజార్టీ నేతలు పార్టీ పదవులకు రాజీనామాలకు సిద్ధమయ్యారు. టీడీపీ కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో ఈ స్థాయిలో నిరసనలపై ఆగ్రహంగా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ అధినేత క్లారిటీ ఇచ్చారు. అయినా సొంత మైలేజ్ కోసం ఇలా వ్యవహరించడంపై గుర్రుగా ఉన్నారు. వర్మ తీసుకునే నిర్ణయాన్ని బట్టి సీరియస్‌గా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. జనసేన కూడా ఈ వ్యవహారంపై ఆచి తూచి స్పందించింది. ఇలాంటి పరిస్థితులు ఎవరి వల్ల వచ్చాయో గుర్తించాలని కోరుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆఫీసు ముందు ప్లెక్సీలు తగలబెడుతుంటే ఎవరి ప్రమేయం ఉందో అర్ధం అవుతుందని చర్చించుకుంటున్నారు. 2014లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే.. వర్మ టీడీపీ రెబెల్‌గా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా..? పోటీ చేస్తే ఏమేరకు ప్రభావం ఉంటుందని ఆరా తీస్తున్నారు వర్మ. ప్రస్తుతం కేడర్‌తో భేటీ అవుతున్నారు. పార్టీ చీఫ్ చంద్రబాబ నుంచి పిలుపు వచ్చినా… కేడర్‌తో మీటింగ్ అయ్యాకే విజయవాడకు వస్తానని చెప్పారు వర్మ.