PAWAN KALYAN: జగన్ కోటలు బద్ధలు కొడతాం.. టీడీపీ-జనసేనతోనే ప్రజలకు భవిష్యత్: పవన్ కళ్యాణ్
జగన్.. సొంత చెల్లినే గోడకేసి కొట్టాడు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఐదుగురు రెడ్లే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను ఎలా లాక్కున్నారు?
PAWAN KALYAN: జగన్ కోటలు బద్ధలుకొట్టి, టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం తాడేపల్లిలో జరిగిన టీడీపీ-జనసేన ఉమ్మడి సభ జెండాలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “జగన్.. సొంత చెల్లినే గోడకేసి కొట్టాడు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా.. మరిచిపోకు. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా ఐదుగురు రెడ్లే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను ఎలా లాక్కున్నారు? వ్యూహాలు రచిస్తాం.
CADBURY CHOCOLATE: ఆ చాక్లెట్స్ వెరీ డేంజర్.. ల్యాబ్ రిపోర్టులో తెల్ల పురుగులు
తాడేపల్లి జగన్ కోటను బద్ధలు కొడతాం. సంస్కారం ఉన్నందునే నీలా మాట్లాడలేక పోతున్నా. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది. రాష్ట్ర లబ్ధి కోసమే నా నిర్ణయాలు ఉంటాయి. సామాన్యుడు రాజకీయాలు చేస్తే తట్టుకోలేక పోతున్నారు. నడమంత్రపు సిరి వెనుక ఒక నేరం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్ బతుకు నాకు తెలుసు. పవన్‌కల్యాణ్ అంటే ఈ రాష్ట్ర భవిష్యత్. నిన్ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్‌కల్యాణ్. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు. ఓడినప్పుడూ మీతోనే ఉన్నాను. గెలిచినప్పుడూ మీతోనే ఉంటాను. నాతో నడిచే వాళ్లే.. నా వాళ్లు. సలహాలు ఇచ్చే వాళ్లు కాదు. పోరాడేవాళ్లు కావాలి. పవన్‌తో స్నేహం అంటే చచ్చేదాకా.. వైరం అంటే అవతలి వాడు చచ్చేదాకా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పొత్తులు పెట్టుకున్నాం. శక్తి సామర్థ్యాలు చూసుకునే 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాం. టీడీపీ-జనసేన సహకారంతోనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది. టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది.
వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు. వైసీపీ రౌడీలకు సభ నుంచి హెచ్చరిక చేస్తున్నా. మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడులు చేస్తే ఊరుకోబోం. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. ఓ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు. 25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. యువతకు 25 ఏళ్ల భవిష్యత్ అందించేందుకే మా ఆలోచన. ప్రజల భవిష్యత్ కోసం రోడ్లపైకి వచ్చాను. జగన్.. ఇప్పటి వరకు నా తాలూకా శాంతినే చూశావు. ఇకపై నా యుద్ధం ఏంటో చూస్తావు. ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి ఉంది. ప్రశ్నించే వారిపై వైసీపీ దాడులు చేస్తోంది. ఏదైనా మాట్లాడదామంటే బెదిరింపులు, దాడులు చేస్తున్నారు” అని పవన్ వ్యాఖ్యానించారు.