Pawan Kalyan: ఫ్లాప్ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తున్న పవన్ కల్యాణ్..
మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Given Chance To make Moive With Surender Reddy
పవన్ కల్యాణ్ కొత్త సినిమా త్వరలో మొదలవుతోంది. చేతిలో మూడు సినిమాలు పెట్టుకొని మరో మూవీనా.. ఈ మాట వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. పవర్‌స్టార్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిజాస్టర్ ఇచ్చిన ఫ్లాప్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ కొత్త ప్రాజెక్ట్ ఓకే చేస్తే.. అభిమానులే పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న 3సినిమాలు పూర్తి చేస్తే చాలంటున్నారు. మూడేళ్ల క్రితం స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు ఇంకా పూర్తికాలేదు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్… రెండేళ్లుగా నలుగుతూనే వుంది. సుజిత్ దర్శకత్వంలో ఓటీ చేస్తున్నాడు. మూడు నెలలుగా ఈ షూటింగ్స్ అన్నీ ఆపేసి పాలిటిక్స్‌లో పవన్ బిజీ అయిపోయాడు.
ఇదిలా వుంటే.. రెండేళ్ల క్రితమే ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. సురేంద్రరెడ్డి ఏజెంట్‌కు ముందే పవన్‌కల్యాణ్‌తో సినిమా కమిట్ అయ్యాడు. ఏజెంట్ డిజాస్టర్ అయినా డెసిషన్ మార్చుకోకుండా.. సురేంద్రరెడ్డి డైరెక్షన్‌లో నటించడానికి ముందుకొచ్చాడు పవన్. రామ్ తాళ్లూరి నిర్మాత కాగా.. సినిమా కోసం తీసుకున్న కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కొత్త సినిమా సైన్ చేసినా.. ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వడం లేదు. చేతిలో వున్న 3 సినిమాలుపూర్తి చేసి రిలీజ్ చేస్తే.. అదే పదివేలన్న ఫీలింగ్‌లో వున్నారు. ఎప్పుడు డేట్స్ ఇస్తాడో.. ఎప్పుడు షూటింగ్ పూర్తిచేస్తారో తెలీదు. దీంతో కొత్త సినిమాపై అభిమానుల్లో ఆసక్తి కనిపించడం లేదు