Pawan Kalyan in Unstoppable2: చిరు దగ్గర దాచి పెట్టి.. బాలయ్యకి మాత్రం చెప్పేశాడు…

pawan kalyan in unstoppable2
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరుతో క్లోజ్ గా మట్లాడటం ఎప్పుడైనా చూశామా? కాని నటిసింహం బాలయ్యతో మాత్రం పవన్ జోజోకులు కూడా పేల్చేస్తున్నాడు. సరదాగా డైలాగ్స్ కూడా వదిలేశాడు.. ప్రోమోలోనే కాదు ఎపిసోడ్ లో కూడా సీన్ అలానే ఉన్నట్టుంది
బేసిగ్గా పవన్ కి మెగాస్టార్ అన్న మాత్రమే కాదు తండ్రితో సమానం. అలా పెరిగాడు కాబట్టి, చిరు దగ్గర ఏం మాట్లాడాలన్నా, ఏం చెప్పాలన్న బెరుకు కామన్. కాబట్టే చిరుదగ్గర మాట్లాడని ఎన్నో సంగతులు బాలయ్య దగ్గర మాత్రం ఓపెన్ అయ్యాడు
తన మూడు పెళ్లిళ్ల మీదొస్తున్న కామెంట్స్ నుంచి, రామ్ చరణ్ వల్ల పవన్ పడ్డ ఇబ్బందుల వరకు పవన్ మనసు విప్పాడు. తనని బేబిసిట్టర్ గా మార్చిన చెర్రీ తుంటరి పనులు, తన కాలేజ్ డేస్ విషయంలో కూడా పవర్ స్టార్ ఓపెన్ అయ్యాడు. మెగాస్టార్ తమ్ముడైనా కాని తను ఎదుర్కోన్న సినిమా కష్టాలు కూడా పవన్ రివీల్ చేయటంతో అంతా షాక్ అవుతున్నారు.
అన్న కాబట్టి తన దగ్గర ఓపెన్ కాలేకపోయినా, బాలయ్యదగ్గర అది కూడా ఓ షో కోసం మాట్లాడవలసి వచ్చింది కాబట్టి పవర్ స్టార్ ఇలా ఓపెన్ అయ్యాడంటున్నారు. ఎపిసోడ్ టెలికాస్ట్ కి ముందే పవన్ మాట్లాడిన విషయాలన్నీ సెట్ లోని జనం తమ వాళ్లతో పంచుకోవటంతో, టెలికాస్ట్ కి ముందే చాలా విషయాలు బయటికొచ్చాయి.