బ్రేకింగ్: పవన్ కర్ణాటక టూర్ సక్సెస్

ఉత్తరాంధ్రలో, చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టడానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 27, 2024 | 03:56 PMLast Updated on: Sep 27, 2024 | 3:56 PM

Pawan Kalyan Karnataka Tour Super Success

ఉత్తరాంధ్రలో, చిత్తూరు జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టడానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ అభ్యర్ధన మేరకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖా మంత్రి ఈశ్వర్. బి. ఖండ్రే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

గజరాజులు బారినుంచి పొలాలను, ప్రాణాలను కాపాడే చర్యలలో కర్ణాటక వద్ద కుంకి ఏనుగులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది అన్నారు. వాటిని ఆంధ్రాకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. ఎకో టూరిజం ప్రమోషన్ కు కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం అని స్పష్టం చేసారు. ఈ ఎం ఓ యు కేవలం పత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా పరస్పర అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కర్ణాటక లో 40 కుంకీ ఏనుగులు ఉన్నాయ్, వాటిలో 4 ఆంధ్రా కు ఇస్తామన్నారు. మూడు నాలుగు నెలలపాటు మావటి లకి శిక్షణ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.