గొడవకే తిరుమల వచ్చా: పవన్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మాట్లాడకుండా అవమానపరిచిన పట్టించుకోలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోలేక పోయాను అన్నారు.

తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మాట్లాడకుండా అవమానపరిచిన పట్టించుకోలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోలేక పోయాను అన్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తే చూస్తే ఊరుకోం అని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితి వైసీపీ తీసుకొచ్చింది అన్నారు. సనాతన ధర్మానికి అన్యాయం చేయడంతోనే రోడ్డుమీదికి వచ్చాను అని తెలిపారు.
కల్తీ ప్రసాదాలు పెట్టారు అన్నారు. అపచారం చేస్తున్నారు సరిచేసుకోమని చెప్పామని పేర్కొన్నారు. ఇది భగవంతుడి సమయం అన్నారు పవన్. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వడం లేదని సినిమా హీరోగా జేజేలు కొట్టించుకోడానికి రాలేదని స్పష్టం చేసారు. హైందవ ధర్మాన్ని కించ పరుస్తున్న వారితో గొడవకు వచ్చాను అన్నారు. డిప్యూటీ సిఎం గా జనం ముందుకు రాలేదు సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు హిందువుగా వచ్చాను అన్నారు. అన్ని మతాలను గుండె నిండుగా గౌరవిస్తానని తెలిపిన పవన్… ఇతర ధర్మాలను సనాతన ధర్మం గౌరవిస్తుందని స్పష్టం చేసారు. సాక్షాత్తు ధర్మానికి నిలువెత్తు స్వరూపమే తిరుమల ఏడుకొండల స్వామి అన్నారు పవన్.