Pawan Kalyan: జగన్‌లా నాపై 32 కేసులు లేవు.. మా అన్నయ్య జోలికొస్తే సహించం: పవన్ కళ్యాణ్

సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైంది. చిరంజీవి జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. సజ్జల నీకు నా సంగతి తెలీదు. చిరంజీవిని బెదిరిస్తున్నారు. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 08:59 PMLast Updated on: Apr 21, 2024 | 9:00 PM

Pawan Kalyan Sensational Comments On Ys Jagan In Narasapuram

Pawan Kalyan: తన అన్న చిరంజీవి అజాత శత్రువు అని, ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జలకు వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆదివారం నాడు నరసాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. “నటులు సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి చంద్రబాబుని మెచ్చుకుంటే, ఆయనను సజ్జల రామకృష్ణారెడ్డి తిడతారు. మా అన్నయ్య చిరంజీవి అజాత శతృవు. ఆయన గురించి సజ్జల ఏమైనా అంటే సహించేది లేదు.

MEGASTAR CHIRANJEEVI: ఏపీ ప్రచారంలో మెగాస్టార్.. ఇక మామూలుగా ఉండదు..

సజ్జలకు డబ్బు, అధికారం ఎక్కువైంది. చిరంజీవి జోలికి గానీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. సజ్జల నీకు నా సంగతి తెలీదు. చిరంజీవిని బెదిరిస్తున్నారు. ఆయన ఒక మాజీ మంత్రి. ఆయనను బెదిరిస్తే చూస్తూ ఊరుకోను. ఇంట్లో నుంచి బయటకు రాని ఆడబిడ్డలను తిట్టిన బ్యాచ్ మీది. సజ్జల పులివెందుల నుంచి వచ్చారో, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారో తెలీదు. సింహం సింగిల్‌గా వస్తుందంటున్నారు. వైకాపా సింహం కాదు గుంటనక్కలు, తోడేళ్ల బ్యాచ్‌. సీఎం జగన్‌ కులాల వారీగా ప్రజలను విడగొట్టే కొద్దీ నేను ఏకం చేస్తా. మీరు నోరు జారండి, తప్పు చేయండి.. మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తా. ఏమనుకుంటున్నావు జగన్ నీ గురించి.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. జగన్ గొడుగు కిందకు ఎవరైనా వెళ్తే అందరూ రౌడీలుగా మారతారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా. జగన్‌లా నాపై 32 కేసులు లేవు. రాష్ట్రాభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిశాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా.. నిలబడ్డానంటే మీ అభిమానమే కారణం. దశాబ్దంపాటు ఒడిదొడుకులు ఎదుర్కొని జనసేన ఎదిగింది. వలసలు, పస్తులు లేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీయే కూటమి లక్ష్యం.

ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే మేం నిలబడ్డాం. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. చేతివృత్తులు, కుల వృత్తులను రక్షిస్తాం. తక్కువ వ్యవధిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు. ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకి నీరు. అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నడుస్తాయి. వశిష్ట వారధి నిర్మించకుండా ఓట్లు అడగబోమని గతంలో చెప్పారు. ఓట్లు అడిగే హక్కు లేదని వైకాపా నేతలకు చెప్పండి. వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించారు. ఆక్వా పరిశ్రమను జగన్‌ సమూలంగా ముంచేశారు. ఆక్వాను లాభసాటిగా సాగేలా చూస్తాం. మత్స్యకారులకు ఉపాధి, ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తాం. వారి భవిష్యత్తుకు వ్యక్తిగత బాధ్యత తీసుకుంటా’’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.