PAWAN KALYAN: పవన్‌కు కన్నీళ్ళు తెప్పించాడు.. ఐర్లాండ్ నుంచి ఓడ కళాసి లెటర్..

వేల సైన్యం ఉంది అనేది పవన్‌ కళ్యాణ్‌ ధైర్యం కాదు.. పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు అనేదే ప్రతీ జనసైనికుడి ధైర్యం. అందుకే పదేళ్లు గడిచినా ఏ ఒక్క జనసైనికుడిలో కూడా ధైర్యం తగ్గలేదు. వాళ్లు బలంగా నిలబడుతూ పవన్‌ కళ్యాణ్‌ను మరింత బలంగా చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 18, 2024 | 03:45 PMLast Updated on: Jan 18, 2024 | 3:45 PM

Pawan Kalyan Shares A Letter Of Fans In Twitter

PAWAN KALYAN: పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు గడించింది. అధికారం సంగతి పక్కన పెడితే.. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఆఖరికి పార్టీ ప్రెసిడెంట్‌ కూడా ఓడిపోయాడు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారిపోయాడు. 150 మంది ఎమ్మెల్యేలతో.. కనీసం సామాన్యులు టచ్‌ కూడా చేయలేని వైసీపీకి ఒక్కడే ఎదురుగా నిలబడ్డారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. ఆయనపై ఉన్న నమ్మకంతో వేల మంది జనసైనికులు ఆయనకు వెన్నంటే నిలిచారు. వేల సైన్యం ఉంది అనేది పవన్‌ కళ్యాణ్‌ ధైర్యం కాదు.. పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారు అనేదే ప్రతీ జనసైనికుడి ధైర్యం. అందుకే పదేళ్లు గడిచినా ఏ ఒక్క జనసైనికుడిలో కూడా ధైర్యం తగ్గలేదు. వాళ్లు బలంగా నిలబడుతూ పవన్‌ కళ్యాణ్‌ను మరింత బలంగా చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులే కాదు.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన జనసైనికులు కూడా పవన్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌ నుంచి పవన్‌ కళ్యాణ్‌కు ఓ జనసైనికుడు రాసిన లెటర్‌ను పవన్‌ కళ్యాణ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ లెటర్ తనను కార్యోన్ముఖుడిని చేసిందని.. గొంతు దుఃఖంతో నిండిపోయిందని ఎమోషనల్‌ అయ్యారు పవన్‌. 2023 డిసెంబర్ 19న రాసిన ఈ లెటర్‌.. ఆ జనసైనికుడి ఆవేదనను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులు ఈ ట్వీట్‌ను షేర్ చేస్తున్నారు.

ఇదీ ఆ లేఖ‌ సారాంశం..
అన్నా..
కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ..
నా దేశాన్ని వదిలి, విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కొనే నాలాంటి వాళ్ళెందరికో ఒక్కటే నీ మీద ఆశ!
ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా? సరికొత్త గెరిల్లా వార్‌ ఫెర్‌ని మొదలెట్టకపోతావా?
మనదేశాన్ని, కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చుకోకపోతామా?
17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా, దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్లందరం.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం
2014- నిలబడ్డాం
2019- బలపడ్డాం
2024-బలంగా కలబడదాం!
కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారుకూతలు కూసేవారిని పట్టించుకోకు.. కారుమబ్బులు కమ్ముతుంటే..కార్యోన్ముఖిడివై వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుంది
Common Man Protection Forceని ప్రకటించినప్పుడే నిన్ను హీరోగా చూడటం మానేశాను. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతివైపు నడిపించే నాయకుడివి

‘ఛే’
ఇట్లు
ఐర్లాండ్ నుంచి ఒక ఓడకళాసి..!