కూతురితో దుర్గమ్మ సన్నిధికి పవన్
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మ ఆలయానికి తన కుమార్తెతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మ ఆలయానికి తన కుమార్తెతో కలిసి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మూలానక్షత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం బారులు తీరారు. దసరా శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజునే ముఖ్యమంత్రి కూడా అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పిస్తారు.
ఇక పవన్ రాకతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. కూతురు ఆధ్య తో కలిసి పవన్ దర్శనానికి వచ్చారు. ఇక ఇదే సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు హోం మంత్రి వంగలపూడి అనిత కూడా రావడంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని చూడగానే భక్తులు జై జనసేన అంటూ నినాదాలు చేసారు.