Pawan Kalyan : రెండు పడవల పై మూడు కాళ్లు వేస్తున్న పవన్..
స్టార్ హీరో ఒకేసారి ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అన్నది కాదు ఎంత త్వరగా రిలీజ్ చేస్తున్నాడు అన్నాదే ముఖ్యం. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేసే అసలుకే ఎసరోస్తుంది.

Pawan Kalyan who scored a hit with the movie Bro is now doing OG movie under the direction of Sujith Also Ustad Bhagat Singh decided to complete the project under the direction of Harish Shankar
స్టార్ హీరో ఒకేసారి ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అన్నది కాదు ఎంత త్వరగా రిలీజ్ చేస్తున్నాడు అన్నాదే ముఖ్యం. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేసే అసలుకే ఎసరోస్తుంది. ప్రజెంట్ ఇలాంటి సిచ్చువేషన్ లోనే ఇరుక్కుపొయ్యాయి ఓజీ, ఉస్తాద్ ప్రాజెక్ట్స్. ఏది ముందు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
బ్రో సినిమాతో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలని గట్టిగా డిసైడయ్యాడు. అయితే ఎప్పటికప్పుడు మారుతున్న పొలిటికల్ సినారియో వల్ల ఏ సినిమా షూటింగ్ సరిగ్గా జరగడం లేదు. అక్టోబర్ ఒకటి నుంచి మళ్లీ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు పవన్. ఈలోగా వీలైనంత షూట్ చేసుకోండి హరీష్ శంకర్ కి కాల్ షీట్స్ ఇచ్చాడు. దీంతో ఓజీ ,ఉస్తాద్ లో ఏది ముందు కంప్లీట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.
ఓజీలో పవన్ లేని సీన్స్ ని తీయడంలో సుజిత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వన్ మంత్ పవన్ సహకరిస్తే ఆ ప్రాజెక్ట్ కి గుమ్మడికాయ కొట్టొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉస్తాద్, ఓజీ రెండూ సమ త్రాసులో నిలబడ్డాయి. ఫస్ట్ ఏది పూర్తవుతుందంటే పవన్ దగ్గర కూడా సమాధానం లేదు. కానీ ఎన్నికల లోపు ఒకటి రిలీజ్ చేయాలి. మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న ఓజి కన్నా పొలిటికల్ పంచులకు స్కోప్ ఉన్న ఉస్తాద్ నే ముందు విడుదల చేస్తేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఓజీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే సీజే వర్క్ కి కూడా టైం పడుతుంది. హరీష్ శంకర్ కి ఇంత రిస్క్ లేదు. కీలక మార్పులతో చేస్తున్న రీమేక్ కాబట్టి ఎక్కడైన షూటింగ్ జరుపుకోవచ్చు. అర్జెంట్ అనుకుంటే అమరావతిలో తీసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. వీటి మీద ఫోకస్ ఉండటం వల్లే పవన్ హరిహర వీరమల్లుకి పూర్తిగా బ్రేక్ ఇచ్చి ఎలక్షన్ల తర్వాత దాని సంగతి చూడబోతున్నాడు. మొత్తానికి ఒక పక్క వాడివేడిగా రాజకీయ పరిణామాలు, ఇంకోవైపు సినిమా షూటింగులతో పవన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తుండటంతో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో అన్నది తెలియడం లేదు.