PAWAN KALYAN: భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..?
పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు మాత్రం నేరుగా చెప్పలేదు. కానీ, ఆ నియోజకవర్గాన్ని వదులుకోబోనని చెప్పడంతో పవన్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అని జనసైనికులు ఎదురుచూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి.
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే, పవన్ తాజా వ్యాఖ్యలతో ఆయన భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం జనసేనలో చేరిన సందర్భంగా పవన్ మాట్లాడారు. భీమవరాన్ని వదులుకోబోనన్నారు. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలన్నారు.
Rashmika Mandanna: పాపం రష్మిక.. మరోసారి డీప్‌ఫేక్ వీడియో వైరల్
భీమవరంలో గెలిస్తే డంపింగ్ యార్డ్‌ను సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ జనసేన గెలిచి తీరుతుందన్నారు. అయితే, పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు మాత్రం నేరుగా చెప్పలేదు. కానీ, ఆ నియోజకవర్గాన్ని వదులుకోబోనని చెప్పడంతో పవన్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారా అని జనసైనికులు ఎదురుచూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. గాజువాకతోపాటు ఇక్కడ కూడా పవన్ ఓడిపోయారు. ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనకాపల్లి, కాకినాడ.. ఇలా పవన్ పోటీ చేసే స్థానంపై చాలాపేర్లు వినిపించాయి. పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ, ఏ స్థానం నుంచి పోటీ చేసేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పవన్ పోటీ చేసే స్థానం కోసం జనసైనికులు ఎదురుచూస్తున్నారు. అసలు పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేక పార్లమెంటుకా కూడా తెలియడం లేదు.
బీజేపీతో సీట్ల సర్దుబాటు ముగిశాక.. పవన్ పోటీ చేసే స్థానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతుంది. మొదట 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అని ప్రకటించినప్పటికీ.. తర్వాత బీజేపీతో పొత్తుతో జనసేన సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ.. కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.