PAWAN KALYAN: పవన్‌ పోటీ చేసే స్థానం ఫిక్స్‌.. భీమవరం నుంచే జనసేనాని

జనసైనికులు అంతా వెయిట్‌ చేసేది.. పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని. అదే విషయంలో ఇప్పడు దాదాపు క్లారిటీ వచ్చేసింది. గత ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి ఆయన పోటీ చేయబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 01:37 PMLast Updated on: Feb 21, 2024 | 1:37 PM

Pawan Kalyan Will Contest From Bhimavaram From Janasena

PAWAN KALYAN: తెలంగాణతో కంపేర్‌ చేస్తే ఏపీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీకి దిగబోతున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా దాదాపు ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చేశాయి. అయితే జనసైనికులు అంతా వెయిట్‌ చేసేది.. పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని. అదే విషయంలో ఇప్పడు దాదాపు క్లారిటీ వచ్చేసింది. గత ఎన్నికల్లో పవన్‌ పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి ఆయన పోటీ చేయబోతున్నారు.

MALLAREDDY: మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ ! ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వాలని కండిషన్

ఇప్పటికే ఈ విషయంలో పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. భీమవరం టీడీపీ లీడర్లతో కూడా పవన్‌ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కోసం పని చేయాలంటూ సూచించారు. మాజీ ఎమ్మెల్యే పులవర్తి ఇంటికి వెళ్లి మరీ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడి వచ్చారు. ఇప్పటికే భీమవరం చేరుకున్న పవన్ కళ్యాణ్‌ అక్కడే ఓ ఇల్లు తీసుకునే పనిలో ఉన్నారు. పవన్‌కు ఇది సొంత కాస్టిట్యూఎన్సీ కాకపోవడంతో ప్రత్యర్థి వర్గం నాన్‌ లోకల్‌ పొలిటీషియన్‌ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో అక్కడే ఇల్లు తీసుకుని ఎన్నికలు ముగిసేవరకూ పవన్‌ భీమవరంలోనే ఉండేదుకు ఫిక్స్‌ అయ్యారని జనసేన వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి కూడా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రెండు స్థానాల్లో ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన వేరే స్థానం నుంచి పోటీ చేస్తారు అని అంతా అనుకున్నారు. ముఖ్యంగా తిరుపతి నుంచి పవన్‌ పోటీలో దిగిబోతున్నారు అని చాలా కాలంగా ప్రచారం జరిగింది.

గతంలో చిరంజీవి కూడా అక్కడి నుంచే పోటీ చేశారు. అక్కడ కాపు సామాజికవర్గం కూడా ఎక్కువ. ఈ సమీకరణాలన్నీ బేరీజు వేసుకుని తిరుపతి నుంచే పవన్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా మరోసారి భీమవరం నుంచే పవన్‌ పోటీకి సిద్ధంమవుతున్నారు. ఇప్పటి పవన్‌ కళ్యాణ్‌ భీమవరం చేరుకున్నారు. నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లబోతున్నారు. పొత్తు విషయంలో బీజేపీ పెద్దలతో చర్చించబోతున్నారు. దీంతో ఎలా చూసినా పోటీ విషయంలో ఇవాళ మధ్యాహ్నంలోగా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది.