PAWAN KALYAN: పిఠాపురం నుంచి బరిలోకి జనసేనాని.. ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న పవన్
తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పదవ వార్షికోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు.
PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని పవన్ స్వయంగా వెల్లడించారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పదవ వార్షికోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
TDP SECOND LIST: టీడీపీ రెండో జాబితా విడుదల.. 34 మందికి టిక్కెట్లు
పవన్ మాట్లాడుతూ.. తనకు గాజువాకలో ఓడిపోతానని ముందే తెలుసన్నారు. అయితే, భీమవరంలో కూడా ఓడిపోతాననే విషయం ప్రచారం తర్వాతే తెలిసిందని చెప్పారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకోవడం లేదని పవన్ అన్నారు. దీంతో పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని జరిగిన ప్రచారానికి తెరపడింది. మరోవైపు.. పిఠాపురం నుంచి వైసీపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. పవన్ పోటీ చేసే అంశాన్ని బట్టి అభ్యర్థిని నిర్ణయించనుంది. ప్రస్తుతం వంగా గీత, ముద్రగడ పద్మనాభం పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. పవన్ భీమవరం నుంచి, కాకినాడ నుంచి, పిఠాపురం నుంచి.. ఇలా చాలా స్థానాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తే.. అక్కడ బలమైన అభ్యర్థిని నిలపాలని జగన్ భావిస్తున్నారు. అందుకోసమే ఆయా స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. గతంలో రెండు చోట్ల ఓడిన పవన్.. ఈసారి ఎలాగైనా గెలిచి.. చట్టసభల్లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన. మరో 9 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి, వారికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చారు పవన్. ఎన్నికల రణక్షేత్రంలో దిగి.. ప్రచారం చేసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, ఆయా స్థానాలక సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=iGY4xzEHlRA