Pawan Kalyan : పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అవుట్ అయ్యాడా.. ఉస్తాద్ లో యేలా కనిపిస్తాడు.. కొత్త టెన్షన్
పవన్‌కల్యాణ్ సినిమా అంటే అంత ఈజీ కాదు.. ఆయన దేని గురించి అయినా చెబుతాడు గానీ.. సినిమా షూటింగ్ గురించి మాత్రం చెప్పలేడు. షూటింగ్ మొదలైనా.. షెడ్యూల్ పూర్తికాకుండానే.. ఒక్కోసారి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడు.

Pawan Kalyans film is not that easy He can talk about anything but he cant talk about the shooting of the film Even after the shooting starts
పవన్‌కల్యాణ్ సినిమా అంటే అంత ఈజీ కాదు.. ఆయన దేని గురించి అయినా చెబుతాడు గానీ.. సినిమా షూటింగ్ గురించి మాత్రం చెప్పలేడు. షూటింగ్ మొదలైనా.. షెడ్యూల్ పూర్తికాకుండానే.. ఒక్కోసారి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లిపోతున్నాడు. ఇలా కంటిన్యూటీ మిస్ కావడంతో.. పవన్ సినిమాలో రకరకాల వేరియేషన్స్‌లో కనిపిస్తాడా? సినిమా అంతా ఒకేలా కనిపించడా? ఒకే సినిమాలో పవన్ రకరకాలుగా కనిపిస్తాడా? అన్న డౌట్ ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. సినిమా షెడ్యూలే కాదు.. సీన్ కూడా అనుకున్న టైంలో పూర్తికావడంలేదు.
ఆ మధ్య ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం 10 రోజులపాటు యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు. రెండు రోజుల షూట్ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో బ్రేక్ ఇచ్చి.. మళ్లీ 15 రోజుల విరామం తర్వాత మంగళవారం నాడు పవన్ పాల్గొనడంతో ఫైట్ సీన్ కంటిన్యూ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్లు తీసుకోవడం.. షెడ్యూల్స్ మధ్య భారీ గ్యాప్ రావడంతో.. అన్ని సీన్స్‌లో ఒకేలా కనిపిస్తాడా? లేదా? అన్న డౌట్ వస్తోంది. కంటిన్యుటీ మిస్ కాకుండా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫేస్‌లో తేడా కనిపిస్తుందన్న భయం లేకపోలేదు.
ఉస్తాద్ మొదటి షెడ్యూల్లో పవన్ 8 రోజులు పాల్గొంటే గ్లిమ్స్ రిలీజ్ చేశాడు. ఈ ఫైట్‌తోపాటు మరికొన్ని సీన్స్ పూర్తి చేస్తే.. టీజర్ రిలీజ్ చేసే అవకాశం వుంది. అయితే.. పవన్ కంటిన్యూస్‌గా వచ్చి షూటింగ్ పూర్తిచేసే వరకు నమ్మకం లేదు. బ్రో సినిమాలో ఒకేలా కనిపించాడంటే.. నాన్‌స్టాప్‌గా 25 రోజులపాటు షూటింగ్‌లో పాల్గొని తన పార్ట్ పూర్తి చేశాడు పవన్. మళ్లీ బ్రో నాటి పరిస్థితి మళ్లీ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.