Hari Hara Veeramallu పవర్ బూస్ట్ వచ్చేసింది పవర్ ఫుల్ యోధుడిగా వీరమల్లు
పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా హరి హర వీరమల్లు సినిమా నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Pawan Kalyans Hari Hara Veermallu First Look Poster
ఎప్పటినుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ మూవీ ప్రాజెక్టులలో హరి హర వీర మల్లు కూడా ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ యాక్ట్ చేస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. పవర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
ఇక లేటెస్ట్ ఫోటోలో పవన్ కళ్యాణ్ చాలా కొత్త లుక్ లో ఓ యోధుడిలా కనిపించి వావ్ అనిపించాడు. నిండుగా గడ్డం, హెయిర్ స్టైల్, ఎరుపు, నలుపు రంగు కలిసిన డ్రెస్ లో అదిరిపోయాడు. కుడి చేతికి కడెం, ఎడమ చేతికి నళ్ల దారంతో షర్ట్ పైకి మడిచి మాస్ లుక్లో ఉన్న పవన్ కల్యాణ్ ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. అయితే ఆ పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీన్ కు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈసినిమా ఆగిపోలేదని.. షూటింగ్ కాస్త లేట్ అవ్వచ్చేమో కాని.. ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నట్టుగా హింట్ ను ఇచ్చేశారు.
అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో క్రిష్ పవన్ కళ్యాణ్‌ని మల్టిపుల్ లుక్స్‌లో ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఎన్నికల లోపు ఈ సినిమాను పవన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది.పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది.