Pawan Kalyan And Mahesh Babu: వారసుల దూకుడు..
మెగాస్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ దూసుకెళుతున్నాడు. మరి పవర్ స్టార్ వారసుడు ఎప్పుడు ల్యాండ్ కాబోతున్నాడు.. రేణూదేశాయ్ మాత్రం ఇప్పుడే కాదంది.. కాని ప్రిపరేషన్ ఎప్పుడో మొదలైంది. ఈ విషయంలో మహేశ్ బాబు ఇంటి నుంచి కూడా వారసుడొచ్చేస్తున్నాడు. లండన్ నుంచి రిటర్న్ అవ్వాగానే సూపర్ సర్ ప్రైజ్ ఉండబోతోంది.. ఇంకా ఎంత మంది వారసులు వరుసలో ఉన్నారో చూస్తే, టాలీవుడ్ 3.0 అదిరిపోయేలా ఉంది.

Pawan, Mahesh and Balayya's sons are the most influential heirs in Tollywood entry
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖీరా నందన్ ఇప్పట్లో సినిమాల్లోకి రాడు. తనకి ఆసక్తి లేదు.. ఇది మొన్నామధ్య రేణూ దేశాయ్ ఇచ్చిన స్టేట్ మెంట్. కాని అఖీరా తను ఫిల్మ్ కోర్స్ వన్ ఇయర్ డిప్లామా చేశాడు. ఇప్పడు కొత్త డిప్లోమా చేస్తున్నాడు.. దీన్ని బట్టి చూస్తే అఖీరా ఎంట్రీ కన్ఫామ్ అనుకోవాల్సిందే. కాకపోతే ఎప్పడనేదే తేలలేదు. పాతికేళ్లు నిండే వరకు సినిమాల్లోకి వెళ్లకూడదనేది పవన్, రేణూ దేశాయ్ ఇద్దరూ అఖీరాకు ఇచ్చిన అడ్వైస్ అని తెలుస్తోంది.
చిరు వారసత్వాన్ని రామ్ చరణ్ ముందుకు తీసుకెళుతున్నాడు. త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారాడు. నాగబాబు వారసత్వాన్ని వరుణ్ తేజ్, అల్లు అరవింద్ వారసత్వాన్ని, మెగా మామ ఇమేజ్ తో పాటు ముందుకు తీసుకెళ్లుతున్నాడు ఐకాన్ స్టార్.. ఈ విషయంలో నాగార్జున వారసులు ఆల్రెడీ ల్యాండై, వాళ్ల జర్నీలో వాళ్లున్నారు. వెంకటేష్ కొడకు ఆన్ ది వే.. ఇంకా ప్రిపరేషన్ లోనే ఉన్నాడు. ఎటొచ్చి బాలయ్య వారసుడు మోక్షగ్న విషయమే తేలట్లేదు.
తనకి ఆసక్తి లేదని కొన్నాళ్లు, లేదు ఆదిత్య 369 సీక్వెల్ తో వస్తాడని ఇంకొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఐతే తన ఎంట్రీ లేటవ్వొచ్చు కాని, రావటం పక్కా అనితెలుస్తోంది. 2025 ఏడాదే అది జరుగుతుందనేది మాటే వినిపిస్తోంది. రజిని, కమల్ వారసులు అనేకంటే వారసురాల్లే ఎప్పుడో హీరోయిన్స్ గా, లేదంటే దర్శకులుగా బిజీ అయ్యాడు. మమ్ముటీ వారసుడిగా దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్ వారసుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా వచ్చాడు. అమితాబ్ వారసుడు హీరోగా రావటమే కాదు, ఆల్ మోస్ట్ రిటైరైనట్టు స్లో గా సైడ్ జర్నీ చేస్తున్నాడు. ఏదేమైనా మోస్ట్ ఇట్రంస్టింగ్ వారసులంటే పవన్ , మహేష్, బాలయ్య కొడుకులే.. వాళ్ల లాంచింగ్ కే ఇంకాస్త టైం ఉంది కాని మూడేళ్లలోపే వాళ్ల సినిమాలు సెట్స్ పైకెళ్లటం మాత్రం కన్ఫామ్ అనుకోవాలి.. దర్శకులతో అఖీరా, గౌతమ్, మోక్షగ్న టెస్ట్ కట్ లు చూస్తుంటే, వీళ్ల ఎంట్రీకి ఎన్నో రోజులు లేవని అనుకోవాల్సి వస్తోంది.