Moga Family : మెగా ఫ్యామిలీ ఫ్రేమ్‌లో పవన్ మిస్సింగ్.. ఇన్‌స్టా రియాక్షన్ చూస్తే మతిపోద్ది..
సంక్రాంతి పండుగను (Sankranti Festival).. మెగా ఫ్యామిలీ (Moga Family) ఓ రేంజ్‌లో జరుపుకుంటోంది. బెంగుళూరులోని (Bangalore) ఫామ్‌హౌస్ (Farmhouse)లో.. మెగా కుటుంబం అంతా వేడుకల్లో పాల్గొంది. మూడు రోజులుగా అక్కడ వాళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అంతా కలిసి ఆడుతున్నారు.. పాడుతున్నారు.. వంటలు చేస్తున్నారు.
సంక్రాంతి పండుగను (Sankranti Festival).. మెగా ఫ్యామిలీ (Moga Family) ఓ రేంజ్‌లో జరుపుకుంటోంది. బెంగుళూరులోని (Bangalore) ఫామ్‌హౌస్ (Farmhouse)లో.. మెగా కుటుంబం అంతా వేడుకల్లో పాల్గొంది. మూడు రోజులుగా అక్కడ వాళ్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. అంతా కలిసి ఆడుతున్నారు.. పాడుతున్నారు.. వంటలు చేస్తున్నారు. వంటల్లో సాయం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలను.. మెగా ఫ్యామిలీ (Moga Family) మెంబర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మెగా కోడలు ఉపాసన అయితే.. బెంగళూరు ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ప్రతీ విషయాన్ని.. అభిమానులతో పంచుకుంటోంది.
మెగా ఫ్యామిలీతో పాటు.. అల్లు ఫ్యామిలీ కూడా ఈ వేడుకల్లో భాగం అయింది. చిరు, రాంచరణ్, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా.. వారి పిల్లలు అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య కూడా ఈ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇక అటు మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దాదాపుగా 40 నుంచి 50 మంది ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. సినీ పరిశ్రమకు పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు.. పరిచయం లేని ఇతర మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా ఈ ఫొటోలో ఉన్నారు. ఐతే ఇందులో మిస్ అవుతోంది ఒకే ఒక్కరు. ఆయనే పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్నికల వేళ.. పవన్ చాలా బిజీగా ఉన్నారు. దీంతో కుటుంబాన్ని కూడా పక్కనపెట్టి.. రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతికి కూడా ఏపీలోనే ఉన్నారు పవన్. ఐతే పవన్.. మెగా ఫ్యామిలీ ఫొటోలో లేకపోవడంతో.. ఇప్పుడు ఇన్‌స్టా వేదికగా మీమ్స్ పోటెత్తుతున్నాయ్. ఫొటోలో 45మంది ఉన్నా.. లేని ఆ ఒక్క పవన్ కోసమే అన్ని కళ్లు ఎదురుచూస్తున్నాయని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇవాళ పండగ అని మెగా ఫ్యామిలీ అంటుంటే.. ఇంకో ఇంట్లో పండగ జరగట్లేదు అంటూ జనతా గ్యారేజీ డైలాగ్‌తో చేసిన మరో మీమ్ ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఐతే మెగా సంబరాల్లో పవన్ లేడు అని బాధపడాల్సిన అవసరం లేదని.. ఈ ఇద్దరిని చూసి ఈ సంక్రాంతికి అడ్జస్ట్ అవుదాం అంటూ.. అకీరా, ఆద్యా ఫొటోలు షేర్ చేస్తున్నారు మరికొందరు. ఏమైనా.. మెగా ఫ్యామిలీ ఫొటో మాత్రం కళ్లు చెమర్చేలా ఉంది బాస్ అంటూ షేర్లు చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా.