Pawan Kalyan, Lejinova : భార్య కోసం సింగపూర్‌కు పవన్.. లెజ్నోవాకు రెండో మాస్టర్స్.. ఇంత టాలెంటెడా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా.. సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. లెజ్నోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా.. సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. లెజ్నోవాకు ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో నిర్వహించిన స్నాతకోత్సవంలో.. ఆమె పట్టా స్వీకరించారు. ఈ వేడుకలకు పవన్ హాజరై, తన భార్యను అభినందించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్‌లో లెజ్నోవా మాస్టర్స్ చేశారు. ఆమె రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు. అక్కడ ఓరియంటల్ స్టడీస్‌లో హానర్స్ పట్టా పొందారు.
ఆసియా దేశాల చరిత్ర, భాషలు, జీవన విధానంపై స్టడీకి.. ముందు డిగ్రీ పొందారు. ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్‌గా ఉంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే… మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో లెజ్నోవా మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు. సింగపూర్‌లో జరిగిన ఈ వేడుకలకు అనా కొణిదెలతో పాటు పవన్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, అనా లెజినోవా సింగపూర్ యూనివర్సిటీకి ఈ గౌరవం స్వీకరించేందుకు వెళుతున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయ్.
లెజినోవా సింగపూర్ ట్రిప్స్‌పై ఈ మధ్య కొందరు రకరకాల కామెంట్లు చేశారు. వారందరికీ.. మాస్టర్స్ డిగ్రీతో క్లారిటీ ఇచ్చారు పవన్. మాస్టర్స్ పట్టా అందుకున్న తర్వాత పవన్‌తో కలిసి లెజ్నోవా దిగిన ఫొటో.. ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక రెండు మాస్టర్ డిగ్రీలు సాధించిన లెజ్నోవా టాలెంట్‌కు.. నెటిజన్లు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లెజ్నోవాకు కంగ్రాట్స్ చెప్తూ.. అభినందనలు తెలుపుతున్నారు.