Pawan Kalyan : తన ఓటు కూడా త్యాగం చేసిన పవన్..
ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పర్వం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికపై ప్రతీ ఒక్కరికీ ఇంట్రెస్ట్ ఉంది. మూడు పార్టీలు కూటమిగా ఒకవైపు. జగన్ మాత్రం ఒకవైపు.
ఏపీ ఎన్నికల్లో పోలింగ్ పర్వం ముగిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికపై ప్రతీ ఒక్కరికీ ఇంట్రెస్ట్ ఉంది. మూడు పార్టీలు కూటమిగా ఒకవైపు. జగన్ మాత్రం ఒకవైపు. ఈ పోరు ఎవరు గెలుస్తారు అనేది రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. దీంతో వేరే ప్రాంతాల్లో సెటిల్ ఐన వాళ్లు కూడా ఏపీకి వచ్చి మరీ ఓట్లు వేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఏపీలో ఎలక్షన్ హీట్ ఈ రేంజ్‌లో ఉండటానికి కారణం పవన్ కల్యాణ్. తక్కువ సీట్లు తీసుకుని.. ప్రత్యర్థల విమర్శలు ఎదుర్కుని కూడా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు పవన్.
ఎన్నికల కోసం ఇంత కష్టపడ్డ పవన్.. తన ఓటు మాత్రం తన పార్టీకి వేసుకోలేకపోయాడు. మంగళగిరిలో పవన్ తన భార్యతో కలిసి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. నిజానికి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. కానీ ఓటు మాత్రం తన నియోజకవర్గంలో కాకుండా మంగళగిరిలో వేశాడు. కూటమిలో భాగంగా ఈ సీటు టీడీపీకి వెళ్లింది. ఈ లెక్కన పవన్ తన సీట్లే కాదు.. తన ఓటు కూడా టీడీపీకే వేశారు. ఇప్పటికే పవన్ మీద ప్రత్యర్థులు చాలా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు కోసం జనసేనను తాకట్టు పెట్టారని.. జనసైనికులను టీడీపీ కోసం కూలీలుగా వాడుతున్నారని ఆరోపణలు చేశారు.
ఇప్పుడు పవన్ తన ఓటు కూడా టీడీపీ స్థానంలోనే వేయడం ప్రత్యర్థులకు మరో ఆయుధంగా మారే అవకాశముంది. సీట్లు మాత్రమే కాదు తన ఓటు కూడా పవన్ టీడీపీకే వేశాడు అని మరిన్ని విమర్శలు చేసే అవకాశం ఉంది. అన్ని పార్టీల నేతలూ ఎవరు ప్రాంతాల్లో వాళ్లు ఓట్లు వేసుకున్నారు. కానీ పవన్ మాత్రం తన కాన్సిట్యుఎన్సీలో కాకుండా మంగళగిరిలో ఓటు వేశాడు. ఇప్పుడు దీనిపై ప్రత్యర్థులు పవన్ మీద ఏలాంటి విమర్శానాస్త్రాలు ఎక్కు పెడతారో చూడాలి.