పవన్ కీలక నిర్ణయం, వాళ్లకు చుక్కలు చూపిస్తారా…?
విశాఖలో జరిగిన ఫార్మా కంపెనీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన స్పష్టం చేసారు.
విశాఖలో జరిగిన ఫార్మా కంపెనీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన స్పష్టం చేసారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు పవన్. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఒకటి పంచాయితీల అభివృధి అని అన్నారు ఆయన. పంచాయితీల లో గ్రామసభలు నిర్వహిస్తాం అని స్పష్టం చేసారు. స్వతంత్ర దినోత్సవం వేడుకులకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి తో నిధులు పెంచామని అన్నారు.
సాధారణ పంచాయతీలను స్వయంశక్తి పంచాయితీల గా చేసామని పేర్కొన్నారు. ఇక ప్రమాదం గురించి మాట్లాడిన ఆయన… అన్ని కర్మాగారాలు లో సేఫ్టీ అడిట్ చేయాలి అని స్పష్టం చేసారు. సేఫ్టీ అడిట్ అంటే కర్మాగారాలు మూసివేయడం అనుకుంటున్నారు అది తప్పు అన్నారు ఆయన. అన్ని రకాల పరిశ్రమలలో జాగ్రత్తలు చాలా ముఖ్యం అని స్పష్టం చేసారు. సేఫ్టీ అడిట్ ఉద్దేశం ఆ పరిశ్రమలు కార్మికులకు తగు భద్రత కల్పించడమే లక్షం అన్నారు. విశాఖ పట్నం చుట్టూ పక్కల ఉన్న అన్ని పరిశ్రమల అదినేతలతో ఒక సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తా అన్నారు పవన్.