Pawan’s Wife : అనాథ పిల్లలతో పవన్ భార్య క్రిస్మస్ వేడుకలు..
టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య అనా లెజ్నోవా మొదటిసారి పబ్లిక్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌లోని ఓ అనాథ శరణాలయంలో పిల్లలతో కలిసి ఆమె క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

Pawan's wife Christmas celebrations with orphans..
టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య అనా లెజ్నోవా మొదటిసారి పబ్లిక్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌లోని ఓ అనాథ శరణాలయంలో పిల్లలతో కలిసి ఆమె క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వాళ్లతో కేక్ కట్ చేయించారు. చాలా సేపు పిల్లలతోనే గడిపి.. వాళ్లతో ఆడుకున్నారు. పిల్లలతో అనా జరుపుకున్న క్రిస్మస్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అనా పెద్దగా బయట కనిపించరు. ఏదో పెద్ద ఈవెంట్, ఫ్యామిలీ ఫంక్షన్ అయితే తప్ప కెమెరా ముందుకు రారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభించినప్పుడు, వరుణ్ తేజ్ పెళ్లిలో, రీసెంట్‌గా చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లినప్పుడు మాత్రమే అనా కనిపించారు.
మళ్లీ ఇప్పుడు పిల్లలతో దర్శనమిచ్చారు. ఎక్కువగా ఫొలోల్లో కనిపించకపోవడంతో అనాకు పవన్‌కు మధ్య గ్యాప్ వచ్చిందని పుకార్లు మొదలయ్యాయి. పవన్ అనా విడిపోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలన్నిటికీ ఒకే ఫొటోతో చెక్ పెట్టేశారు పవన్ కళ్యాన్. ఇద్దరూ కలిసి మెగాకుటుంబంలో జరిగిన ఈవెంట్‌కు హాజరయ్యాయి. దీంతో వాళ్లిద్దరూ విడిపోతున్నారన్న వార్తలకు చెక్ పడింది. అలా అరుదుగా కెమెరా ముందుకు వచ్చే అనా.. ఇప్పుడు పిల్లలతో క్రిస్మస్ జరుపుకోవడం ప్రతీ ఒక్కరినీ ఇంప్రెస్ చేస్తోంది. హైదరాబాద్, బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ది చిల్డ్రన్ సంస్థలో అనా లెజ్నోవా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.
అక్కడి అనాథ పిల్లలతో కాసేపు సరదాగా గడిపిన అనా.. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత వారి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఆ అనాథశ్రమం కోసం ఆమె నిత్యవసరాలను అందించి మానవత్వాన్ని చాటారు. అనా గొప్పమనసుకు ఆ అనాథశ్రమ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెని సత్కరించారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. మెగా ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనాది కూడా పవన్ కళ్యాణ్ లాంటి మనసే అంటూ కామెంట్లు పెడుతున్నారు.