Pawan’s wife : పవన్ భార్యకు 1800 కోట్ల ఆస్తి ఉందా ? అన్నా గురించి ఎవరికీ తెలియని నిజాలు.
ఏపీ రాజకీయాలను సింగిల్ హ్యాండ్‌తో మలుపు తిప్పిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమికి ఈ స్థాయి విజయం రావడంలో పవన్‌దే కీలక పాత్ర.
ఏపీ రాజకీయాలను సింగిల్ హ్యాండ్‌తో మలుపు తిప్పిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమికి ఈ స్థాయి విజయం రావడంలో పవన్‌దే కీలక పాత్ర. ఏపీ రాజకీయాల్లో ఆయన ఎలాంటి కీలక పాత్ర పోషించారో.. పవన్ జీవితంలో ఆయన భార్య అన్నా లెజ్నోవా కూడా అంతే కీలక బాధ్యత పోషించారు. ప్రచారంలోనే కాదు.. గెలిచిన తరువాత కూడా భార్య నుంచి పవన్‌కు ఉన్న సపోర్ట్ మద్దతకు ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు.
ఇదే క్రమంలో అన్నాకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తుల వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. రష్యాలో పుట్టి పెరిగిన అన్నాకు రష్యాతో పాటు సింగపూర్‌లో బిజినెస్‌లు ఉన్నాయంటూ వార్తలు చర్కర్లు కొడుకున్నాయి. సింగపూర్, రష్యాలో అన్నాకు హోటల్స్ ఉన్నాయని.. వాటి విలుద దాదాపు 1800 కోట్లు ఉంటుందని చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు. కానీ ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి సినీ వర్గాలు. 1980లో రష్యాలో పుట్టిన అన్నా లెజ్‌నోవా అక్కడే మోడలింగ్ వృత్తిలో స్థిరపడింది. ఆ తరువాత రష్యాతో పాటు సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా కనిపించింది. తీన్మార్ సినిమా సమయంలో అన్నాకు పవన్‌కు పరిచయం ఏర్పడింది.
అది ప్రేమగా మారి వాళ్లు పెళ్లి చేసుకున్నారు. కేవలం మోడల్ మాత్రమే కాకుండా అన్నా మంచికొరియోగ్రాఫర్ కూడా. మోడలింగ్, కొరియోగ్రఫీ తప్ప అన్నాకు ఎలాంటి బిజినెస్‌లు లేవని తెలుస్తోంది. కేవలం సినిమాల ద్వారా వచ్చే ఆదాయం తప్ప ఆమెకు ఎక్కడా హోటల్స్ లేవట్. ఇంటర్నెట్‌లో అనెన్షన్ గ్రాబ్ చేసేందుకు కొందరు రాసిన పిచ్చి రాతల వల్ల ఇలాంటి పుకార్లు వచ్చాయంటున్నారు అన్నా జీవితాన్ని దగ్గరగా చూసినవాళ్లు.