Payal Rajput : ప్రియుడి తల పగలగొట్టిన పాయల్ రాజ్‌పుత్
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) తన ప్రియుడి తల పగలకొట్టింది. అందులోనూ ప్రేమికులరోజు ఈ పని చేసి వీడియోను ధైర్యంగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. లవర్ నచ్చకపోతే.. బ్రేకప్ చెప్పాలి. అంతేగానీ.. ఇలా ఇంజురీ చేయడం ఏంటంటున్నారు నెటిజిన్లు. ఆర్‌ఎక్స్ 100 తో మంచి హిట్ అందుకున్నా.. ఆ తరువాత పాయల్ రాజ్‌పుత్‌కు మంచి అవకాశాలు రాలేదు.

Payal Rajput who broke her boyfriend's head
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) తన ప్రియుడి తల పగలకొట్టింది. అందులోనూ ప్రేమికులరోజు ఈ పని చేసి వీడియోను ధైర్యంగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. లవర్ నచ్చకపోతే.. బ్రేకప్ చెప్పాలి. అంతేగానీ.. ఇలా ఇంజురీ చేయడం ఏంటంటున్నారు నెటిజిన్లు. ఆర్‌ఎక్స్ 100 తో మంచి హిట్ అందుకున్నా.. ఆ తరువాత పాయల్ రాజ్‌పుత్‌కు మంచి అవకాశాలు రాలేదు. దీంతో కేరీర్ క్లోజ్ ఐపోయింది అనుకుంటున్న టైంలో ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ (Ajay Bhupathi Payal) కు మంగళవారం (Mangalavaaaram ) రూపంలో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి మరో హీరోయిన్ ఒప్పుకోదు.
కెరీర్ మొదటల్లో బ్రేక్ ఇచ్చిన దర్శకుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. చాలాకాలం తర్వాత పాయల్‌కు మంగళవారంతో హిట్ పడితే.. వాలంటైన్స్ డేనాడు ప్రియుడితో గొడవపెట్టుకుంది. అక్కడితో ఆగకుండా… బాటిల్‌తో లవర్ సౌరభ్ ఢింగ్రా తల పగలకొట్టి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయింది పాయల్. ఈ వీడియోలో పాయల్ రెండు యాంగిల్స్‌లో తల పగలుకొట్టింది. ముందు నుంచి తీసిన కెమెరాలో ప్రియుడు బాగా ఒరిగిపోయి ఫ్రేమ్ లోంచి వెళ్లిపోయాడు. వెనకనుంచి తీసిన విజువల్లో జస్ట్ పక్కకు మాత్రమే ఒరిగాడు. ఈలెక్కన ఇదంతా సినిమా షూటింగ్‌లో భాగమేనని.. నిజంగా పాయల్ ప్రియుడి తల పగలగొట్టలేదని తేలిపోయింది. మొత్తానికి బ్రేకప్‌తో వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంది పాయల్.