మంగళవారం అదేం పని..?
పాయల్ రాజ్ పుత్ ప్రదాన పాత్ర పోషిస్తున్న చిత్రం మంగళవారం. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై చాలా ఆశలు కనిపిస్తున్నాయి.

Payal Rajput will be coming to the audience with a movie on Tuesday under the making of RX Hundred director Ajay Bhupathi.
పాయల్ రాజ్ పుత్ అప్పట్లో ఆర్ ఎక్స్ హండ్రెడ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూనే లేడీ విలన్ గా షాక్ ఇచ్చింది. ఆసర్ ప్రైజ్ కి బాక్సాఫీస్ మొత్తంషేక్ అయ్యింది. అలాంటి హీరోయిన్ ఏరేంజ్ కి వెళ్లిపోతుందో అనుకునేలోపు, అడ్రస్ లేకుండా పోయింది. మళ్లీ ఇప్పడు ఆర్ ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మేకింగ్ లోనే మంగళవారం మూవీతో మర్డర్ కి స్కెచ్చేస్తోంది
రివేంజ్ డ్రామాకి డివోషనల్ టచ్ ఇచ్చిన అజయ్ భూపతి, ఈసారైనా గట్టెక్కుతాడా? ఎందుకంటే ఇలానే మహాసముద్రం టైంలో ప్రయోగం చేసి, ఊహించని షాక్ ఇచ్చాడు. డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. ఇప్పడు తన కెరీర్ నే మంగళవారం మూవీతో రిపేర చేసుకుంటున్న అజయ్ భూపతి పాయల్ ఫేట్ ని కూడా ఈసారి మార్చేలా కనిపిస్తున్నాడు
కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ ని ఈసినిమాకు తీసుకుని మంచిపనిచేసిన అజయ్, ఇది హర్రర్, థ్రిల్లర్, రివేంజ్ డ్రామానో తేల్చకుండా, ఇచ్చిన ట్రైలర్ ఇండస్ట్రీలో అందరి అటెన్షన్ లాక్కుంటోంది. చాలా క్రియేటివ్ గా ఎక్కడ కథ రివీల్ కాకుండా, అలాని ఇంట్రస్ట్ తగ్గకుండా ఇచ్చిన ప్రోమో పేలింది. ఇది ఏమాత్రం వర్కవుట్ అయినా అటు పాయల్, ఇటు అజయ్ భూపతి ఫేట్ మారినట్టే.