AP Pensions: ఏపీలో పెన్షన్ పంపిణీ.. కొత్త విధానం ఇదే.. మార్గదర్శకాలు జారీ
ఈసీ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం.. కలెక్టర్లు, ఇతర అధికారులకు సూచనలు చేసింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 3, బుధవారం నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారిగా పెన్షన్ పంపిణీ చేయాలి.
AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వానికి ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఆదేశాలను సవరిస్తూ.. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసీ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం.. కలెక్టర్లు, ఇతర అధికారులకు సూచనలు చేసింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 3, బుధవారం నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారిగా పెన్షన్ పంపిణీ చేయాలి.
Mr Tea Naveen Reddy: మిస్టర్ టీ నవీన్ రెడ్డిపై కత్తులతో దాడి.. ఎటాక్ చేసింది ఎవరంటే..
ఇందుకోసం రెండు పద్ధతులు ఫాలో కావాలి. వృద్ధులు, దివ్యాంగులు, అస్వస్థతకు గురైనవారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, వితంతువులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించాలి. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ద్వారా పింఛన్ ఇవ్వాలి. అలాగే దూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం వచ్చే గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. గ్రామ సచివాలయాలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పని చేయాలి. బుధవారం మధ్యాహ్నం పింఛన్ల పంపిణీ ప్రారంభించి.. ఏప్రిల్ 6 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. పింఛన్ల పంపిణీకి తగినంతగా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవటంతో 2 విధాలుగా పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నారు. వీళ్లంతా ఇప్పుడు పెన్షన్ల పంపిణీలో భాగం కానున్నారు. ఏపీలో పెన్షన్లు వాలంటీర్లు పంపిణీ చేస్తారనే సంగతి తెలిసిందే.
అయితే, వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తారనే ఉద్దేశంతో, వారిని ఎన్నికల సమయంలో విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి ఫిర్యాదులొచ్చాయి. దీంతో వాలంటర్లీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు పింఛన్ల పంపిణీకి, విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఈ నిర్ణయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటలయుద్దం నడుస్తోంది. పేదలకు పెన్షన్లు రాకుండా టీడీపీ అడ్డుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అంటోంది.