Hajj 2024 : హజ్ యాత్రలో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు.. 577 మందికి పైగా మృతి..
ముస్లింల పవిత్ర యాత్ర అయిన హజ్ యాత్రలో తీవ్ర విషాద ఛాయాలు అలుముకున్నాయి. కాగా ఈ నెల 17నా హజ్ యాత్రలో తీవ్ర వడదెబ్బ తగిలి దాదాపు 19 మంది ఒకే రోజు మరణించారు.

People falling like quails during Hajj.. More than 577 people died..
ముస్లింల పవిత్ర యాత్ర అయిన హజ్ యాత్రలో తీవ్ర విషాద ఛాయాలు అలుముకున్నాయి. కాగా ఈ నెల 17నా హజ్ యాత్రలో తీవ్ర వడదెబ్బ తగిలి దాదాపు 19 మంది ఒకే రోజు మరణించారు. భారీ ఎండలకు.. తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. తాజాగా ఆ మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా పెరిగిపోతుంది.
ఈ హజ్ యాత్ర మొదలైనప్పటి నుంచి నేటి వరకు 577 మందికి పైగా యాత్రికులు మరణించినట్లు అరబ్ దౌత్యవేత్తలు స్వయంగా ప్రకటించారు. వీరిలో అత్యధికంగా ఈజిప్షియన్లు 323 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరంతా వేడి సంబంధిత సమస్యలతో మరణించినట్లు వెల్లడించారు. 60 మంది జోర్డానియన్ కూడా మృతి చెందారన్నారు. ప్రస్తుతం మక్కాలో 50డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు.
గత ఏడాది 240కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. సౌదీలో హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. కాగా గత ఏడాది కన్న డబుల్ గా మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో హజ్ యాత్రలో మృత్యుఘోషలు వినపిస్తున్నాయి.