కుక్క పంచాయితీ, చేతులెత్తేసిన పోలీసులు

మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరింది పెంపుడు కుక్క పంచాయతీ. నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తి పెంపుడు కుక్క 8 నెలల క్రితం మిస్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2024 | 11:10 AMLast Updated on: Sep 13, 2024 | 11:10 AM

Pet Dog Issue In Telangana

మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్ కు చేరింది పెంపుడు కుక్క పంచాయతీ. నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తి పెంపుడు కుక్క 8 నెలల క్రితం మిస్ అయింది. నెల్లికుదురులో వెంకటేష్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క అచ్చం తన కుక్కలాగే ఉండడంతో ఆ కుక్కను తన ఇంటికి సారయ్య తీసుకెళ్ళారు. ఆ కుక్క మాదంటే మాదంటూ ఇరువురి మధ్య గొడవ జరుగుతోంది.

నెల్లికుదురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కుక్క పంచాయతీ పోలీస్ స్టేషన్ లో సెట్ కాకపోవడంతో కుక్కను మండలంలోని పశువైద్యశాలకు తరలించారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షలుచేసి మహబూబాబాద్ లోని డాగ్ సెంటర్ కు అప్పగించారు. ఇద్దరి పంచాయితీ ఇప్పుడు డాగ్ ఫాంకు చేరింది.