Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌తో హీరోయిన్ల సీక్రెట్స్ లీక్‌! ఆమె విడాకులకు ఇదే కారణమా..

సినీ హీరోయిన్లు, హీరోల ఫోన్ కాల్స్‌ కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు కూడా లాగారని టాక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2024 | 05:11 PMLast Updated on: Mar 27, 2024 | 5:11 PM

Phone Tapping Issue Tollywood Heroine Divorced Because Of This

Phone Tapping: తెలంగాణలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా.. ఇంతా కాదు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయ్. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేసిన ప్రణీత్ రావు చేసిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ ప్రైవేట్ ఛానెల్‌లో సర్వర్లు ఏర్పాటు చేసి.. ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఐతే ప్రభుత్వం మారాక.. సర్వర్లు, డేటా, స్టోరేజ్ డివైజేస్‌ డ్యామేజీ చేశారనే ఆరోపణలపై ప్రణీత్ రావును రేవంత్ సర్కార్‌ అరెస్ట్ చేసి విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ్.

Adah Sharma: అందాల బొమ్మ.. అదా శర్మ.. లేటెస్ట్ ఫొటోస్..

సినీ హీరోయిన్లు, హీరోల ఫోన్ కాల్స్‌ కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత విషయాలను, ప్రొఫెషనల్ విషయాలను గుట్టు చప్పుడు కాకుండా తెలుసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు కూడా లాగారని టాక్. ట్యాపింగ్ వ్యవహారంలో హీరోలు, హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎవరిపై ఎందుకు నిఘా పెట్టారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయింది. అయితే చాలామంది హీరోయిన్ల ఫోన్ కాల్స్‌పై మాత్రం నిఘా పెట్టి వారి నుంచి చాలా వివరాలు సేకరించారు. వాటి ఆధారంతో వారిని బ్లాక్ బెయిల్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఓ స్టార్ హీరోయిన్ పేరు కూడా తెరపైకి రావడం మరో సంచలనంగా మారింది. ఈ ట్యాపింగ్‌తో ఆమె వైవాహిక జీవితం కూడా తారుమారు అయిందనే టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో పెద్ద కుటుంబానికి చెందిన హీరోను పెళ్లి చేసుకున్న ఆ హీరోయిన్.. కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. ఐతే ఆ డివోర్స్ తీసుకోవడానికి కూడా ఈ స్కామ్ ఓ కారణమనే గాపిస్‌.. మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐతే అధికారికంగా పోలీసులు ఈ విషయాలను బయటపెడితే తప్ప.. ఎలాంటి క్లారిటీ ఉండదని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయ్. ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. టాలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు.